Mahesh and Rajamouli : మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై ఫ్యాన్స్ లో, ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా గురించి మూవీ టీం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయలేదు. కానీ సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ టాపిక్స్ లో ఈ చిత్రం కచ్చితంగా ఉంటుంది. రీసెంట్ గానే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ పడింది. మరో నెల రోజుల వరకు విశ్రాంతి. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక క్రేజీ రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఇది కొత్త రూమర్ కాదు, పాతదే, కానీ మళ్ళీ ఆ వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది.
Also Read : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళి కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…
వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరోస్ లో ఒకరైన చియాన్ విక్రమ్ ని రాజమౌళి సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో ఒక మూవీ ప్రమోషన్ కి వచ్చినప్పుడు చియాన్ విక్రమ్ రాజమౌళి తో సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను రాజమౌళి నిత్యం మాట్లాడుకుంటూనే ఉంటాం. కచ్చితంగా భవిష్యత్తులో రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా ఉంటుంది. కానీ ఇప్పుడు మహేష్ తో ఆయన చేస్తున్న సినిమా గురించి నాతో ఎలాంటి చర్చలు చెయ్యలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో పృథ్వీ రాజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఇది కేవలం రూమర్ అని అంతా అనుకున్నారు. కానీ అదే నిజమైంది. ఈ వార్త ప్రచారం లో ఉన్నప్పుడు ఒక ప్రమోషన్ ఈవెంట్ లో విలేఖరులు పృథ్వీ రాజ్ ని ఈ చిత్రం గురించి అడిగితే పైన విక్రమ్ ఎలా మాట్లాడాడో, ఆయన కూడా అదే విధంగా మాట్లాడాడు.
కానీ చివరికి మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. అదే విధంగా విక్రమ్ కూడా ఈ సినిమాలో భాగం అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. విక్రమ్ ఈ సినిమాలో భాగాం అయితే సినిమాకు చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు. సరిగ్గా వాడుకోవాలే కానీ అతనితో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. కానీ ఈమధ్య కాలం లో డైరెక్టర్స్ సరిగా వాడుకోవడం లేదు. దానివల్ల ఫ్లాప్స్ ఎదురు అవుతున్నాయి. ఇప్పుడు రాజమౌళి చేతిలో విక్రమ్ పడితే, ఆయనకు మంచి బ్రేక్ దొరికినట్టు అవుతుంది, సినిమా కూడా మరో లెవెల్ కి వెళ్తుంది. చూడాలి మరి అభిమానుల ఆకాంక్ష ఎంత వరకు నెరవేరుతుంది అనేది. కేవలం విక్రమ్ మాత్రమే కాదు, ఇతర భాషలకు చెందిన పాన్ ఇండియన్ నటీనటులు కూడా ఈ చిత్రం లో నటించబోతున్నారు.
Also Read : మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!