Spirit : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga)…ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి చేసిన ‘అనిమల్’ (Animal) సినిమా అంతకు మించిన సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సైతం అతనికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. వరుస సక్సెస్ లను సాధించడంలో తనకు తానే దిట్ట అనే గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడు సైతం ఈ జనరేషన్ లో ఉన్న దర్శకుల్లో తనకు పోటీ ఇచ్చేది సందీప్ రెడ్డి వంగ మాత్రమే అంటూ ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం…మరి ఆయన తన సినిమాలతో భారీ విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్నాడు.
Also Read : స్పిరిట్ సినిమాలో ప్రభాస్ చెల్లెలుగా నటిస్తున్న స్టార్ హీరోయిన్…
కాబట్టి ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను సాధించి ఆయన తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit ) అనే సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
అయితే ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనే దాని మీద పలు రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇందులో గోపీచంద్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఆయన చేయబోతున్న క్యారెక్టర్ ఏంటి? విలన్ గా చేస్తున్నాడా? లేదంటే ప్రభాస్ ఫ్రెండ్ గా నటించబోతున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. మరి మరోసారి ఈ సినిమా ద్వారా వాళ్ల ఫ్రెండ్షిప్ ని భారీ రేంజ్ లో ఎలివేట్ చేస్తూనే ఇద్దరు కూడా మరోసారి స్టార్లుగా మారే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ పై సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ!