https://oktelugu.com/

Spider Man: స్పైడర్​ మ్యాన్​ వచ్చేస్తున్నాడు.. పుష్పకు ఒక్కరోజు ముందే థియేటర్లలో సందడి

Spider Man: మార్వెల్ కామిక్స్​లో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది స్పైడర్​ మ్యాన్​. ఇప్పటికే ఈ కామిక్​ మీద ఎన్నో సిరీస్​లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్పైడర్​ మ్యాన్​కు అభిమానులయ్యారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చి స్పైడర్​ మ్యాన్​ను చూసి ఎంజాయ్​ చేశారు. తాజాగా స్పైడర్​ మ్యాన్​ : నో వే హోమ్​తో మరోసారి అలంచేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​. ఈ నెల 16న థియేటర్లలో సందడి చేసేందుకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 03:44 PM IST
    Follow us on

    Spider Man: మార్వెల్ కామిక్స్​లో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది స్పైడర్​ మ్యాన్​. ఇప్పటికే ఈ కామిక్​ మీద ఎన్నో సిరీస్​లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్పైడర్​ మ్యాన్​కు అభిమానులయ్యారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చి స్పైడర్​ మ్యాన్​ను చూసి ఎంజాయ్​ చేశారు. తాజాగా స్పైడర్​ మ్యాన్​ : నో వే హోమ్​తో మరోసారి అలంచేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​. ఈ నెల 16న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్​ మొదలైపోయింది. ఒక్క ప్రసాద్ మల్టీప్లక్స్​లోనే అడ్వాన్స బుకింగ్​ ప్రారంభించిన మొదటి రెెండు గంటల్లో 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సమాచారం.

    Spider Man

    ఇంగ్లీష్​తో పాటు, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్పైడర్​ మ్యాన్​ : నో వే హోమ్ విడుదల కానుంది. గతంలో వచ్చిన ఈ సిరీస్​ చిత్రాలకు ఇది భిన్నంగా ఉండనుందని అంటున్నారు. ప్రపంచానికి తానెవరో తెలిసిపోడవంతో చిక్కుల్లో పడ్డ స్పైడర్​ మ్యాన్​.. డాక్టర్​ స్ట్రేంజ్​ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏకంగా ముగ్గురు నలుగురు విలన్లతో స్పైడర్ మ్యాన్​ పోరాడుతారని తెలుస్తోంది. గతంలో కంటే అంతకు మించి ఈ సినిమా ఉంనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మరి ఇన్ని అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్​ సక్సెస్​ను అందుకుంటుందో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

    Also Read: ఓ ఇంటివాడు కాబోతున్న ప్రభాస్​.. ఆ ప్రాంతంలో కోటలాంటి భవన నిర్మాణానికి ఏర్పాట్లు?

    మరోవైపు, పుష్ప సినిమా కూడా ఈ సినిమా తర్వాత రోజు అంటే డిసెంబరు 17న విడుదల కానుండటం విశేషం. ఈ క్రమంలోనే స్పైడర్​ మ్యాన్​ పుష్పరాజ్​కు గట్టి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. సుకుమార దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మక హీరోయిన్​గా నటిస్తోంది.

    Also Read: “సర్కస్ కార్ 2” చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన తేజస్వి మాదివాడ…