https://oktelugu.com/

Ravi Teja: మాస్ మహరాజ్ రవితేజ అభిమానులకు నిరాశ తప్పదా… ఆ మూవీ రిలీజ్ వాయిదా ?

Ravi Teja: మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. వరుసగా 5 సినిమాల్లో నటిస్తూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు రవి తేజ. క్రాక్ సినిమాతో చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ… ప్రస్తుతం “ఖిలాడి” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా… మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 03:30 PM IST
    Follow us on

    Ravi Teja: మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. వరుసగా 5 సినిమాల్లో నటిస్తూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు రవి తేజ. క్రాక్ సినిమాతో చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ… ప్రస్తుతం “ఖిలాడి” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా… మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మూవీయూనిట్ ప్రకటించింది.

    Ravi Teja

    Also Read: గ్లామర్​ హద్దులు చెరిపేసి హాట్ లుక్స్​తో సామ్​.. నెట్టింట పిక్స్ వైరల్​

    అయితే ఇప్పుడు ఖిలాడి చిత్రం విడుదల తేదీ వాయిదా పడనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఖిలాడి సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మరోకొంత షూట్ చేయాల్సి ఉందని… విదేశాల్లో చేయవలసిన ఒక షెడ్యూల్ పెండింగ్ లో ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాను అనుకున్న తేదీకి రిలీజ్ చేయక పోవచ్చు అంటూ సోషల్ మీడియా లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమాలతో పాటు రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు చిత్రాల్లో నటిస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ.

    Also Read: స్పైడర్​ మ్యాన్​ వచ్చేస్తున్నాడు.. పుష్పకు ఒక్కరోజు ముందే థియేటర్లలో సందడి