https://oktelugu.com/

RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటి ఇచ్చిన మూవీ యూనిట్…

RRR Movie: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో తారక్ కొమరం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 03:46 PM IST
    Follow us on

    RRR Movie: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో తారక్ కొమరం భీమ్​గా కనిపించనుండగా… చరణ్​ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారు. కాగా నిన్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్​ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్​కు చేరుకుని… ప్రభంజనం సృష్టించింది.

    RRR Movie

    Also Read: మీడియాపై పంచ్​లు పేల్చిన రాజమౌళి

    భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న పలు సినిమాలు మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి దర్శన మిస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ కూడా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండొచ్చని అంతా అనుకున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్లలో విడుదలైన మూడు నెలల వరకు ఓటీటీలో విడుదల కాదని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. తెలుగు ఓటీటీ హక్కులను జీ5… హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసాయి. మిగిలిన లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది.

    Also Read: ప్రెస్ మీట్ లో పునీత్ సాంగ్ పాడుతూ ఎమోషనల్ అయిన జూనియర్ ఎన్టీఆర్…