Allu Arjun Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొత్తానికి బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా తన ప్రభావాన్ని బాగానే చూపిస్తోంది. మొత్తానికి ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి ‘అల్లు అర్జున్’ చేసిన ఈ పాన్ ఇండియా ప్రయత్నం పర్వాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా పుష్పలో డైలాగ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాయలసీమ స్లాంగ్‌లో అల్లు అర్జున్ పలికించిన డైలాగ్ లు అధ్భుతంగా ఉన్నాయి.

పైగా పుష్ప డైలాగ్స్ కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో గొప్ప హిట్ అయ్యాయి. అన్ని డైలాగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ తాజాగా అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాలోని అన్ని డైలాగ్స్‌ను ఒక చోట చేర్చి ఒక వీడియోను విడుదల చేశారు. డైలాగ్ జ్యూక్ బాక్స్ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
Also Read: రివ్యూ : ఆడవాళ్లు మీకు జోహార్లు

సినిమా మొదలు నుంచి చివరి వరకు అల్లు అర్జున్ డైలాగ్‌లన్నింటినీ ఒక చోట చేర్చి . పుష్పరాజ్ పవర్ ఫుల్ డైలాగ్‌లను మీరూ ఓసారి వినండి అంటూ వదిలారు. పుష్ప’ అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.145.5 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే 18 రోజుల కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసింది. ఇక నేటి నుంచి వచ్చే కలెక్షన్స్ మరియు మిగిలిన అన్ని రైట్స్ తాలూకు డబ్బులు అన్నీ లాభాల కిందకే వస్తాయి.
[…] Vijay Devarakonda Movie With Samantha: సమంత ప్రస్తుతం మైథాలాజికల్ మూవీ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇప్పటికే సమంత ‘శాకుంతలం’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్ సినిమా కూడా చేస్తోంది. తాజాగా తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్టుకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన పూరి దర్శకత్వంలో రూపొందుతున్న రెండో సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. […]
[…] Aadavallu Meeku Joharlu Collections: తెలుగు సినీ రంగంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమాలు చేయడం శర్వానంద్ కు మంచి టేస్ట్ ఉంది. ‘శతమానం భవతి’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన శర్వానంద్.. చాలా రోజుల తర్వాత ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ ఫ్యామిలీ డ్రామా సినిమాతో ముందుకు వచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గి అంతా సద్దుమణిగిన తర్వాత వచ్చిన మొదటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిలిచింది. […]