పాట పాడతా పైసలు ఇవ్వండి అంటున్న ‘బాలు’

కరోనా వైరస్ భాదితులు యెంత మంది ఉన్నారో ఇంకా అంతుపట్టడం లేదు. కరోనా వల్ల ప్రత్యక్షంగా , పరోక్షంగా లెక్కకు మిక్కిలిగా జనం ఇబ్బందులు పడుతున్నారు ఇంకా చెప్పాలంటే నరకం చూస్తున్నారు నిలువ నీడకు నోచు కొక , పని పాటా లేక అనేక మంది అల్లాడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి అన్ని రంగాల వారు ముందుకు వస్తున్నారు . వారిలో సినిమా రంగానికి చెందిన వారు కూడా వున్నారు అలా కరోనా భాదితులను ఆదుకొనే క్రతువులో […]

Written By: admin, Updated On : April 3, 2020 8:37 pm
Follow us on


కరోనా వైరస్ భాదితులు యెంత మంది ఉన్నారో ఇంకా అంతుపట్టడం లేదు. కరోనా వల్ల ప్రత్యక్షంగా , పరోక్షంగా లెక్కకు మిక్కిలిగా జనం ఇబ్బందులు పడుతున్నారు ఇంకా చెప్పాలంటే నరకం చూస్తున్నారు నిలువ నీడకు నోచు కొక , పని పాటా లేక అనేక మంది అల్లాడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి అన్ని రంగాల వారు ముందుకు వస్తున్నారు . వారిలో సినిమా రంగానికి చెందిన వారు కూడా వున్నారు అలా కరోనా భాదితులను ఆదుకొనే క్రతువులో తాను కూడా భాగస్వామి నవుతానంటున్నాడు. మధుర గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం.

గాన గంధర్వుడు ఎస్ పీ బాలు గారికి ఎంతో మంది అభిమాను లున్నారు వారిలో అనేక మంది ఆయన్ని పేస్ బుక్ లో కూడా ఫాలో అవుతారు. అలాంటి వారిని తాను చేయబోయే బృహత్ కార్యానికి వినియోగించు కోవాలన్నదే బాలు గారి వాంఛ. ఆ క్రమంలో బాలు గారు స్థాపించిన SPB ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కి విరాళాలు సేకరించ సంకల్పించారు. ఈ ట్రస్ట్ కి విరాళాలు ఇవ్వదలుచుకొన్న వారు 100 రూపాయల నుంచి యెంత మొత్తాన్ని అయినా విరాళంగా ఇవ్వవచ్చు …అలా ఇచ్చిన వారికి ప్రతిఫలంగా ఎస్ పీ గారు వారు కోరిన ఒక పాట పాడతారట …అలా వినూత్న పద్దతిలో తన సామర్ధ్యం కొద్దీ విరాళాలు సేకరించి కరోనా భాదిత పేదలకు ఇవ్వాలన్నది బాలు గారి సంకల్పం .