ప్రాణాంతక వైరస్ మీద ఎపుడో సినిమా తీసేవాడిని

దర్శక మేధావి గా తన సినీ ప్రస్థానం ప్రారంభించి చాలా షార్ట్ టైములో అత్యంత పాపులర్ ఫిగర్ అయ్యాడు.తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చు కొన్నాడు.సినిమా పరంగా ఎన్నో ప్రయోగాలు చేసాడు. సక్సెస్ లో పీక్స్ కి వెళ్ళాడు. మళ్ళీ స్వయం కృతాపరాధం తో డౌన్ ఫాల్ అయ్యాడు. ఇపుడు వ్యంగ్య కామెంట్స్ చేసుకొంటూ కాలం గడుపుతున్నాడు. మధ్య మధ్యలో సినిమాలు కూడా తెస్తున్నాడు. అయితే వాటిలో మునుపటి ప్రతిభ కనపడటం లేదు. అందుకే వాటికి […]

Written By: admin, Updated On : April 3, 2020 8:31 pm
Follow us on


దర్శక మేధావి గా తన సినీ ప్రస్థానం ప్రారంభించి చాలా షార్ట్ టైములో అత్యంత పాపులర్ ఫిగర్ అయ్యాడు.తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చు కొన్నాడు.సినిమా పరంగా ఎన్నో ప్రయోగాలు చేసాడు. సక్సెస్ లో పీక్స్ కి వెళ్ళాడు. మళ్ళీ స్వయం కృతాపరాధం తో డౌన్ ఫాల్ అయ్యాడు. ఇపుడు వ్యంగ్య కామెంట్స్ చేసుకొంటూ కాలం గడుపుతున్నాడు. మధ్య మధ్యలో సినిమాలు కూడా తెస్తున్నాడు. అయితే వాటిలో మునుపటి ప్రతిభ కనపడటం లేదు. అందుకే వాటికి లేనిపోని వివాదాలు జోడించి విడుదల చేస్తున్నాడు.

ఇంతకీ ఎవరా మహానుభావుడు అనుకొంటున్నారా ..? ఇంకెవరు వివాదాల బ్రహ్మ రామ్ గోపాల్ వర్మ.

ప్రస్తుతం ప్రేక్షకుల చేత రూత్ లెస్ ( క్రూర మైన ) డైరెక్టర్ గా పిలిపించుకొంటున్న రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ పై తాను స్వయంగా రాసి, స్వరపరిచి, పాడిన సాంగ్ ప్రోమో విడుదల చేసి భయపెట్టడం జరిగింది. కాగా నేడు ఆయన కరోనా పై మరోబాంబు పేల్చాడు ( ట్వీట్ చేశాడు ). నిజానికి 2018లో కరోనా లాంటి వైరస్ పై ఓ మూవీ తీయడానికి ఆయన సిద్దమయ్యాడట , తనతో గతంలో `సర్కార్ `, ` 26/11 అటాక్స్` వంటి చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ పరాగ్ సాంగ్వి ఈ చిత్రాన్నీ ప్రొడ్యూస్ చేయాలను కోవడం కూడా జరిగింది అన్నాడు . దానికి సంబంచిన లింక్ కూడిన ట్విట్టర్ లో జత చేసాడు.

ఎబోలా వంటి వైరస్ లు ముంబై లాంటి జనసాంద్రత అధికంగా గల ప్రాంతం లో విజృంభిస్తే ఎలా ఉంటుందో చెప్పే విధంగా ఆ సినిమా తీయాలని అనుకొన్నాను. దీనికి ‘వైరస్’ అని టైటిల్ కూడా నిర్ణయించానని ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు .