
తమిళ దళపతి విజయ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విజయ్ ఫాలోయింగ్ బాగా పెరుగుతూ ఉంది. గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల అయిన బిగిల్ (తెలుగులోవిజిల్ ) భారీ విజయం దక్కించుకొంది. కేవలం ఇండియా లోనే 200 కోట్లు వసూళ్లు సాధించి సినీ వర్గాలను అబ్బురపరిచింది. ప్రస్తుతం విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో `మాస్టర్ ` మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కావాల్సి వుంది. కానీ కరోనా వైరస్ కారణంగా మాస్టర్ చిత్రం వాయిదా పడింది.
కాగా ఈ చిత్రంలో విజయ్ రెండు విభిన్న పాత్రల్ని పోషిస్తున్నాడు. అందులో ఒకటి కాలేజీ ప్రొఫెసర్ కాగా రెండోది గ్యాంగ్ స్టర్ పాత్ర అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ గ్యాంగ్ స్టర్ పాత్ర పేరు భవాని అని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ భవాని పాత్ర సినిమాలో చాలా ఇంపాక్ట్ చూపుతుంది అంటున్నారు . ఇక హీరో విజయ్ కి విలన్ గా నటిస్తున్న (హీరో) విజయ్ సేతుపతి మధ్య గ్యాంగ్ వార్ ఓ రేంజ్ లో ఉంటుందని వారిద్దరి మధ్య వచ్చే దృశ్యాలు చాల ఎక్సయిటింగ్ ఉంటాయి అని అంటున్నారు. జావియర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.