Also Read: ప్రముఖ నటికి పక్షవాతం.. ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు?
బాలసుబ్రమణ్యం మరణవార్త తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి చాలా ఎమోషన్ అయ్యారు. బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఎస్పీ బాలు ఇకలేరనే చేదు నిజాన్నిజీర్ణించుకోలేక పోతున్నాను.. బాలు త్వరగా కోలుకొని వస్తారని.. ఆయన వైభవం మళ్లీ చూస్తామని ఎంతో ఆశగా ఎదురు చూసిన తనకు తీవ్ర నిరాశే ఎదురైందని వాపోయాడు. తమ మధ్య సినిమాపరంగానే కాకుండా వ్యక్తిగతం మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. తన సొంత అన్నను కొల్పోయాననే బాధ కలుగుతుందని చిరంజీవి ఎమోషన్ అయ్యారు.
తాను మద్రాసులో ఉన్న సమయంలో పక్కపక్క వీధుల్లోనే ఉండేవాళ్లమని.. అప్పుడప్పుడు కలుసుకునే వాళ్లం.. అన్నయ్యా అని పిలిచేవాన్ని.. ఆయన తనను తమ్ముడూ అని ప్రేమగా పిలిచేవారని తెలిపారు. తన సినీ కెరీర్ ఎదుగుదలకు ఎస్పీ బాలు పాడిన పాటలు ఎంతోగానో దోహదం చేశాయని తెలిపారు. మొదట్లో ఆయనని నువ్వు అని సంబోధించే వాడినని.. ఆ తర్వాత ఆయన గొప్పతనం తెలుసుకుని మీరు అని సంబోధించే వాడినని చెప్పారు. దీంతో ఆయన చిన్నబుచ్చుకునేవారని.. ఏమయ్యా ఏమైంది నీకు.. మీరు అంటే దూరం పెరుగుతుందని.. నువ్వు అనే పిలవాలని కోరేవారని తెలిపారు.
తనకు సినిమాపరంగానూ మంచి సలహాలు ఇచ్చేవారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ‘ఏమయ్యా నువ్వు కమర్షియల్ చట్రంలో పడిపోయి నీలో ఉన్న నటుడిని దూరం చేసుకుంటున్నావ్.. నువ్వు మంచి నటుడివి.. నువ్వు నటనకు ప్రాధాన్యం ఇచ్చే క్యారెక్టర్స్ చేయాలని చెప్పేవారన్నారు. ఆయన మాటలే తర్వాతి రోజుల్లో తాను రుద్రవీణ.. ఆపద్భాందవుడు.. స్వయంకృషి.. లాంటి సినిమాలు తీసేందుకు ప్రేరణగా నిలిచాయన్నారు.
Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ !
ఎస్పీ బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు మనమధ్యలోనే ఉంటారని.. బాలుకు మరణం లేదని మెగాస్టార్ అన్నారు. చిరుతోపాటు పలువురు సెలబ్రెటీలు బాలసుబ్రమణ్యంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.