men women workers
.
మహిళలకు పురుషులతో పాటు సమాన వేతనం ఇచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఒకే పనిచేసే ఇద్దరికి వేతనాల్లో తేడా ఉండదని తెలిపింది. ఈ చట్టం సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ఖలీపా బిన్ యాజెద్ ఆల్ నహ్యాన్ తెలిపారు. 1980లో చేసిన ఫెడరల్ లా నెంబర్ 08లోని ఆర్టికల్ 32 ప్రకారం మగాళ్లతో పాటు ఆడవాళ్లకు సమాన వేతనాన్ని ఇవ్వాలని ఈ చట్టాన్ని తీసుకొచ్చామని బిన్ యాజెద్ ఆల్ నహ్యాన్ ప్రకటించారు. ఈ ఉత్తర్వు ఎమిరెట్స్‌లో మహిలలను సాధికారపిరిచే ప్రక్రియల్ కొత్త సానుకూల దశ అని విదేశాంగ సహాయ మంత్రి డాక్టర్ అన్వర్ గార్గాష్ అన్నారు. దీంతో ఇక వేతనాలు జెండర్ ప్రకారం కాకుండా పనిని భట్టి నిర్ణయించనున్నారు.
Also Read: డిగ్రీ పూర్తి చేస్తే 50వేలు.. ఇంటర్ పాసైతే 25వేలు..