https://oktelugu.com/

లెజెండరీ సింగర్ కరోనాని జయిస్తున్నారు !

లెజెండరీ సింగర్ సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు ఎస్పీ శైలజగారు. బాలుగారికి వెంటిలేషన్ తొలిగించారని.. ఆయన ఆరోగ్యం పై డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని.. రోజురోజుకు అన్నయ్య ఆరోగ్యం కుదటపడుతూ ఉందని.. అన్నయ్య కోసం ప్రార్ధనలు చేసిన అందరికీ కృతజ్ఞతలని.. ఎస్పీ శైలజగారు స్పష్టం చేశారు. మొత్తానికి బాలుగారు ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలోకి […]

Written By:
  • admin
  • , Updated On : August 18, 2020 / 03:48 PM IST
    Follow us on


    లెజెండరీ సింగర్ సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు ఎస్పీ శైలజగారు. బాలుగారికి వెంటిలేషన్ తొలిగించారని.. ఆయన ఆరోగ్యం పై డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని.. రోజురోజుకు అన్నయ్య ఆరోగ్యం కుదటపడుతూ ఉందని.. అన్నయ్య కోసం ప్రార్ధనలు చేసిన అందరికీ కృతజ్ఞతలని.. ఎస్పీ శైలజగారు స్పష్టం చేశారు. మొత్తానికి బాలుగారు ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలోకి వచ్చారని మరికొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకుంటారని డాక్టర్స్ కూడా చెప్పడంతో అందరూ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

    Also Read: మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !

    అయితే నిన్న రాత్రి బాలుగారు ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందనే విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకు గురైయ్యారనే విషయంతో పాటు, బాలుగారి ఆరోగ్యం విషమించినట్లు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు నిన్న రాత్రి విడుదల చేసిన అప్ డేట్ ను కూడా మేము ఈ ఉదయం రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలుగారి ఆరోగ్యం పై లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఆయన త్వరగా కోలుకుంటున్నారు.

    Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

    ఇప్పటికే బాలుగారి ఆరోగ్యం పై ప్రముఖుల సైతం తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ బలంగా కోరుకోనుకున్నారు. అలాగే లక్షలాది అభిమానులు బాలుగారి ఆరోగ్యం కోసం చేసిన పూజలు కూడా ఫలించాయి. బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో కరోనాని జయిస్తున్నారు. ఇది సంగీత ప్రపంచానికి ఎంతో శుభవార్త.