https://oktelugu.com/

ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. వెనుక కథేంటి?

ఏపీలో మూడు రాజధానుల కేసు విచారణలో భాగంగా ఇవాళ సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏపీ గవర్నర్ ఆమోదించిన ఈ మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ కీలకమైన ఏపీ తలరాతను మార్చే పీటీషన్ కావడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేతోపాటు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రహ్మణియన్ లతో కూడిన త్రిసభ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2020 3:32 pm
    Follow us on


    ఏపీలో మూడు రాజధానుల కేసు విచారణలో భాగంగా ఇవాళ సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏపీ గవర్నర్ ఆమోదించిన ఈ మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ కీలకమైన ఏపీ తలరాతను మార్చే పీటీషన్ కావడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేతోపాటు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రహ్మణియన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ విచారిస్తోంది.

    Also Read: ఫోన్ ట్యాపింగ్: చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్

    అయితే విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ లేవనెత్తిన ఓ అభ్యంతరంతో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

    సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఏ తీర్పులకైనా అత్యున్నత బాధ్యతాధికారి. అయితే ఆయన కూతురునే రంగంలోకి దింపారు అమరావతి రైతులు. సుప్రీంలో 3 రాజధానులపై వాదించేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కూతురు కావడం గమనార్హం. బాబ్డే కూతురు ఏపీ రాజధాని రైతుల తరుఫున వాదిస్తున్నట్టు న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో తాను ఈ విచారణను నుంచి తప్పుకుంటున్నట్టు బాబ్డే ప్రకటించారు. ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేయాలని సుప్రీం రిజిస్ట్రార్ ను ఆదేశిస్తూ బుధవారానికి విచారణను వాయిదా వేశారు.

    రైతుల తరుఫున కింది కోర్టుల్లో వాదిస్తున్న లాయర్ తన కూతురే కాబట్టి ఈ కేసులో తాను ఇచ్చే ఆదేశాలపై ఆ ప్రభావం పడకుండా జస్టిస్ బాబ్డే ఇలా నిక్కచ్చిగా వ్యవహరించారు.

    Also Read: రూ.5 కోట్లు లంచం తీసుకున్న తహసీల్దార్?

    ఏపీ తలరాతను మార్చే కీలక కేసు కావడంతో ధర్మాసనం కూడా రాగద్వేశాలకు అతీతంగా ఈ కేసు నుంచి తప్పుకుంది. సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన నిర్ణయంతో ఈ కేసు విచారణపై ప్రభావం పడకుండా చూసుకున్నారు.

    అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన కేసులో సుప్రీం చీఫ్ జస్టిస్ కూతురునే రాజధాని రైతులు లాయర్ గా పెట్టుకోవడం వెనుక ఏదైనా మతలబు ఉందా అన్న అనుమానాలను వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కేసును మేనేజ్ చేసి అనుకూలంగా తీర్చు తెచ్చుకోవడానికే ఇలా చేశారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఏది ఏమైనా ఇలా కీలక కేసు నుంచి చీఫ్ జస్టిస్ బాబ్డే తప్పుకోవడం నిజంగానే గొప్ప పరిణామంగా కనిపిస్తోంది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచిచూడాలి..