https://oktelugu.com/

భారత్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూపు..!

ప్రస్తుతం కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్న పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మరి పేరుతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో ప్రారంభమైన కరోనా ప్రస్థానం ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ మహమ్మరి అందరినీ కబళించేస్తోంది. అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ తదితర దేశాల్లో కరోనా విలయతాండవం సృష్టించింది. ప్రతీరోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెద్దసంఖ్యలో ఉండటంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2020 / 04:15 PM IST
    Follow us on


    ప్రస్తుతం కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్న పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మరి పేరుతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో ప్రారంభమైన కరోనా ప్రస్థానం ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ మహమ్మరి అందరినీ కబళించేస్తోంది. అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ తదితర దేశాల్లో కరోనా విలయతాండవం సృష్టించింది. ప్రతీరోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెద్దసంఖ్యలో ఉండటంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు.

    Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

    కొన్నిదేశాలు లాక్డౌన్ విధిస్తూ కరోనాను కట్టడి చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ముఖానికి మాస్కులు ధరించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం లాంటివి చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఒకింత భయాందోళన నెలకొని ఉంది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ కోసం సైంటిస్టులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా తాము కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి గుడ్ న్యూస్ తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ పలు అనుమానాలు రేకెత్తుతోన్నాయి.

    రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పూర్తిస్థాయి ట్రయల్స్ నిర్వహించకుండానే రిలీజ్ చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థే పేర్కొంది. తమ దేశానికే చెందిన వైద్యులే రష్యా వ్యాక్సిన్ వాడేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో రష్యా వ్యాక్సిన్ ఎంతమేరకు విజయం సాధిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈనేపథ్యంలోనే అందరి చూపు భారత్ వైపు చూస్తున్నారు. భారత దేశంలో ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. భారత్ తయారుచేసే వ్యాక్సిన్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రపంచంలో అత్యంత చౌక ధరతో నాణ్యమైన వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. దీంతో ప్రతీఒక్కరు భారత్ నుంచే వ్యాక్సిన్ రావాలని ఎదురుచూస్తున్నారు.

    Also Read: తెలంగాణకు కేంద్రం భారీ నిధులు.. అయినా టెస్టులు తక్కువే?

    ప్రస్తుతం మనదేశంలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కోవ్యాక్సిన్ పేరుతో వ్యాక్సిన్ తయారు చేస్తోంది. భారత్ తయారు చేస్తున్న తొలి కరోనా వ్యాక్సిన్ ఇదేకాగా.. గతనెలలోనే ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. దీంతోపాటు జైడస్ క్యాడిలా తయారు చేస్తున్న డీఎన్ఏ టైప్ వ్యాక్సిన్ రెండోదశలో ఉంది. ఇక ఆక్స్ ఫర్డ్ యూనివర్సీటీ-భారత్ సీరమ్ ఇన్ స్టిట్యూట్ భాగస్వామ్యంతో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ తుదిదశకు చేరుకుంది. ఈ వ్యాక్సిన్ ఇప్పటివరకు తయారవుతున్న టీకాల్లో మెరుగైన ఫలితాలను అందిస్తోంది.

    ఇప్పటికే భారత్ వ్యాక్సిన్ల ఖార్ఖానా గా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా వ్యాక్సిన్ భారత్ నుంచే వస్తే ప్రపంచానికి అత్యంత చౌక ధరలో అందించడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ప్రపంచమంతా భారత వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. త్వరలోనే వారి ఆశలు నెరవేరి భారత వ్యాక్సిన్ అందరికి అందుబాటులో రావాలని కోరుకుందాం..