https://oktelugu.com/

ఖాకీ కాదు ఖద్దరు వేయనున్న పవన్‌!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను వెండితెరపై చూసి చాన్నాళ్లు కావస్తోంది. రెండేళ్ల కింద ‘అజ్ఞాతవాసి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్‌. అదేమో డిజాస్టర్గా మిగిలింది. ఆపై, ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాడు . ఓ దశలో సినిమాలకు దూరం అవుతున్నట్టు కూడా ప్రకటించాడు. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడడంతో మనసు మార్చుకున్నాడు. వేరే వ్యాపారాలు కూడా లేకపోవడంతో అన్నం పెట్టిన ఇండస్ట్రీకే తిరిగొచ్చాడు. ఒకే టైమ్‌లో మూడు సినిమాలకు ఓకే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 04:22 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను వెండితెరపై చూసి చాన్నాళ్లు కావస్తోంది. రెండేళ్ల కింద ‘అజ్ఞాతవాసి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్‌. అదేమో డిజాస్టర్గా మిగిలింది. ఆపై, ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాడు . ఓ దశలో సినిమాలకు దూరం అవుతున్నట్టు కూడా ప్రకటించాడు. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడడంతో మనసు మార్చుకున్నాడు. వేరే వ్యాపారాలు కూడా లేకపోవడంతో అన్నం పెట్టిన ఇండస్ట్రీకే తిరిగొచ్చాడు. ఒకే టైమ్‌లో మూడు సినిమాలకు ఓకే చెప్పేసిన పవన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    Also Read: ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్

    ‘వకీల్‌ సాబ్‌’తో వీలైనంత తొందరగా ప్రేక్షకులను పలకరించాలని అనుకున్నాడు. హిందీ హిట్ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ చిత్రంలో పవన్‌ ఫస్ట్‌ టైమ్‌ లాయరు పాత్రలో కనిపిస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతాలు. ఇప్పటికే సగం కంటే ఎక్కువ షూటింగ్‌ పూర్తయింది. వేసవి లేదంటే దసరా కానుకగా రిలీజ్‌ చేద్దామనుకున్న యూనిట్‌ ప్లాన్‌పై కరోనా నీళ్లు కుమ్మరించింది. ప్రాణాంతక మహమ్మారి కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ చిత్రీకరణ వద్దని పవన్‌ చెప్పడంతో ఇది ఈ ఏడాది రిలీజ్‌ అవడం కష్టమే.

    Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

    వకీల్‌సాబ్‌ షూటింగ్‌ నిలిచిపోవడంతో కరోనా బ్రేక్‌ టైమ్‌లో పవన్‌ ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో చేసే పీరియాడికల్‌ డ్రామాకు సంబంధించి స్క్రిప్టు వర్క్‌ కంప్లీట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే సినిమాపై కూడా క్లారిటీ వచ్చిందని సమాచారం. పవన్‌ వీరాభిమాని అయిన హరీశ్‌ గబ్బర్ సింగ్‌తో ఇప్పటికే అతనికి ఇండస్ట్రీ హిట్‌ అందించాడు. సర్దార్ గబ్బర్ సింగ్‌ తీసే అవకాశం చేజారినప్పటికీ గద్దలకొండ గణేష్తో తన స్టామినా నిరూపించుకున్నాడు హరీశ్‌. దాంతో, పవన్‌ నుంచి అతనికి మరో చాన్స్‌ వచ్చింది. అయితే, ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. గబ్బర్ సింగ్‌ మాదిరిగా ఇందులో కూడా పవన్‌ పోలీస్‌ పాత్రలో చేస్తాడని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, అది నిజం కాదని ఇది పక్కా పొలిటికల్‌ సబ్జెక్ట్‌ అని తాజా సమాచారం. హీరోగా, పొలిటీషియన్‌గా పవన్‌ స్టార్డమ్‌ను దృష్టిలో ఉంచుకొని హరీశ్‌ పవర్ఫుల్‌ పొలిటికల్‌ డ్రామాతో కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ పక్కా కథనం రెడీ చేస్తున్నాడని సమాచారం. వకీల్‌ సాబ్‌, క్రిష్‌తో మూవీ తర్వాత ఇది తెరకెక్కే అవకాశం ఉంది. ఎంతలేదన్న కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల తర్వాతే రిలీజ్‌ కావొచ్చు. అప్పటికి రాజకీయంగా కూడా పవన్‌కు ప్లస్‌ రీతిలో ఈ మూవీని తీర్చిదిద్దాలన్నది చిత్ర బృందం ప్లాన్‌ అనిపిస్తోంది. అదే నిజమైతే పవన్‌ వెండితెరపై ఫస్ట్‌టైమ్‌ ఖద్దరు బట్టలతో పొలిటీషియన్‌గా కనిపిస్తాడు. ఈ ఫిల్మ్‌ ప్రీ ప్రొడక్షన్‌ దాదాపు చివరి దశకు వచ్చేసింది. షూటింగ్‌ గురించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.