https://oktelugu.com/

బాలుగారి హెల్త్ అప్ డేట్ : కోలుకుంటున్నారు, కానీ.. !

సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్‌-19తో గత కొన్ని రోజులుగా తీవ్రంగా పోరాడి దాన్ని జయించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇంకా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నారు. కాగా ఆయన ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ప్రకారం బాలుగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలుగారి తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి అప్ డేట్ రిలీజ్ చేస్తూ.. ‘నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆయనకు ఇంకా వెంటిలేటర్ సహాయంతోనే […]

Written By:
  • admin
  • , Updated On : September 20, 2020 / 10:29 AM IST
    Follow us on


    సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొవిడ్‌-19తో గత కొన్ని రోజులుగా తీవ్రంగా పోరాడి దాన్ని జయించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇంకా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నారు. కాగా ఆయన ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ప్రకారం బాలుగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలుగారి తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి అప్ డేట్ రిలీజ్ చేస్తూ.. ‘నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆయనకు ఇంకా వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఊపిరితిత్తులు ఇంకా రికవర్ అవ్వాల్సి ఉంది. మిగతావన్నీ నార్మల్ గా ఉన్నాయి. రోజూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. నిన్నట్నుంచి నాన్న నోటితో ఆహారం తీసుకుంటున్నారు. ఇది ఆయనలో శక్తిని మరింత పెంచుతుంది’ అని ఎస్పీ చరణ్ తెలిపారు.

    Also Read: ఔరా.. అనిపిస్తున్న ‘బిగ్ బాస్’ పేమెంట్లు..!

    ప్రస్తుతం బాలుగారు వైద్యుల సహాయంతో లేచి కూర్చుంటున్నారు. 15-20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారు. వచ్చే వారం పూర్తయ్యే నాటికి బాలుగారి ఆరోగ్యం విషయంలో శుభవార్త వింటామనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. బాలుగారి మళ్లీ పూర్తిగా కోలుకుని ఆయన కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో మళ్ళీ అలరించాలని ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నారు. ప్రత్యేకమైన వైద్య బృందం నిరంతరం బాలుగారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మొత్తానికి బాలుగారి ఆరోగ్యం విషయంలో పాజిటివ్ న్యూస్ రావడంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.

    Also Read: మణిశర్మ కుమారుడికి ‘ఆఫర్’ ఇచ్చిన మెగాస్టార్?

    ఎందుకంటే గత కొన్ని రోజులుగా బాలుగారు ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. అలాగే సినీ మహామహులతో పాటు యావత్తు సినీ లోకమంతా బాలుగారి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్ధనలు కూడా చేశారు. ఇవ్వన్నీ ఆ దేవుడు అలకించాడేమో.. బాలుగారి ఆరోగ్యం రోజురోజుకూ కుదటపడుతుంది.