70 కోట్లుకు తక్కువైతే సినిమా చేయడట !

దర్శకుడు సురేందర్ రెడ్డికి ‘సైరా’ లాంటి భారీ సినిమా చేసే అవకాశమే లక్కీగా వచ్చింది. ప్రతి సినిమాని అలాగే చేస్తానంటే ఎలా.. చేసిన సైరా సినిమాకే నష్టాలు వచ్చాయి. పైగా ఆ సినిమాలో ఇండియన్ సినీ ఇండస్ట్రీల నుండి సూపర్ స్టార్స్ అందరూ కలిసి నటించారు. అంత చేసినా దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఆ సినిమాని హిట్ చేయలేకపోయాడు. అందుకే ఆయనకు తన తరువాత సినిమాని పట్టుకోవడానికి చాలామంది హీరోల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ప్రభాస్ దగ్గర […]

Written By: admin, Updated On : September 20, 2020 10:42 am
Follow us on


దర్శకుడు సురేందర్ రెడ్డికి ‘సైరా’ లాంటి భారీ సినిమా చేసే అవకాశమే లక్కీగా వచ్చింది. ప్రతి సినిమాని అలాగే చేస్తానంటే ఎలా.. చేసిన సైరా సినిమాకే నష్టాలు వచ్చాయి. పైగా ఆ సినిమాలో ఇండియన్ సినీ ఇండస్ట్రీల నుండి సూపర్ స్టార్స్ అందరూ కలిసి నటించారు. అంత చేసినా దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఆ సినిమాని హిట్ చేయలేకపోయాడు. అందుకే ఆయనకు తన తరువాత సినిమాని పట్టుకోవడానికి చాలామంది హీరోల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ప్రభాస్ దగ్గర నుండి మొదలు పెట్టి, రవితేజ మీదుగా చివరికి అక్కినేని అఖిల్ దగ్గరకు వచ్చి ఆగాడు.

Also Read: ఔరా.. అనిపిస్తున్న ‘బిగ్ బాస్’ పేమెంట్లు..!

నిజానికి మధ్యలో తన తరవాత సినిమాని సురేందర్ రెడ్డి, ఆల్లు అర్జున్ తో ఫిక్స్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేశాడు. ఆ మేరకు కొన్ని సిట్టింగ్ లు కూడా జరిగినా వర్కౌట్ అవ్వలేదు. ఆ తరువాత చైతుతో సినిమా అన్నారు. కానీ అది ఏమయిందో తెలియదు గానీ, మళ్ళీ సురేందర్ రెడ్డి – అక్కినేని అఖిల్ సినిమా లైన్ లోకి వచ్చింది. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ అందించాడు. వంశీ కథ అఖిల్ కి కరెక్ట్ గా సరిపోతుందని.. అందుకే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించాడని తెలుస్తోంది.

Also Read: మణిశర్మ కుమారుడికి ‘ఆఫర్’ ఇచ్చిన మెగాస్టార్?

కాకపోతే బడ్జెట్ విషయంలో మాత్రం సురేందర్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదట. సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా నేను మంచి పనితనం కనబర్చాను, సినిమా భారీ సక్సెస్ కాకపోవడానికి నేను కారణం కాదు అని సురేందర్ రెడ్డి చెప్పుకొస్తున్నాడట. అఖిల్ హీరోగా వక్కంతం వంశీ కథతో నేను చేస్తోన్న ఈ సినిమాకి డెబ్బై కోట్ల బడ్జెట్ అవుతుందని.. నేను అడిగిన బడ్జెట్ ఇవ్వకపోతే సినిమాని చేయనని చేబుతున్నాడట. మరి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అంత బడ్జెట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందనేది సురేందర్ రెడ్డి నే ఆలోచించుకోవాలి.