Homeఎంటర్టైన్మెంట్South Superstars : సూపర్ స్టార్ల అసలు పేర్లు ఏమిటో తెలుసా...

South Superstars : సూపర్ స్టార్ల అసలు పేర్లు ఏమిటో తెలుసా ?

South Superstars: Real Names Of South Indian Superstars

South Superstars:  సినిమా నటీనటులకు (South Superstars) పేర్లు మార్చుకోవడం అనే ఒక ఆనవాయితీ ఉంది. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొచ్చి, సాధారణ నటుడు కాస్త స్టార్ అయిపోతాడు అనే నానుడి కూడా ఉంది. మరీ ఇలా పేర్లు మార్చుకున్న కొంతమంది ప్రముఖుల గురించి చూద్దాం.

సూపర్ స్టార్ రజినీకాంత్:

రజినీకాంత్ గారి అసలు పేరు “శివాజీ రావ్ గైక్వాడ్ “. దర్శకులు స్వర్గీయ బాలచందర్ గారే రజనికి ఈ పేరు పెట్టారు. అప్పటికే “శివాజీ” పేరుతో దిగ్గజ నటులు “శివాజీ గణేశన్” ఉండడంతో , “రజినికాంత్” అనే పేరు పెట్టారు.

మెగా స్టార్ చిరంజీవి:

చిరంజీవి గారి అసలు పేరు “శివ శంకర వరప్రసాద్”. తన ఇష్ట దైవం ఆంజనేయుడి పేరు కూడా కలిసేలా “చిరంజీవి” అని పేరు పెట్టుకున్నారు.

కమల్ హాసన్:

కమల్ హసన్ అసలు పేరు చాలామందికి తెలియదు. కమల్ అసలు పేరు ‘పార్థసారధి శ్రీనివాసన్’. సినీ ప్రవేశం కోసం “కమల్ హాసన్”గా పేరు మార్చుకున్నారు..

పవన్ కళ్యాణ్:

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏమిటో తెలుసా ? “కళ్యాణ్ బాబు”, అయితే, ఆయన మొదటి సినిమా సమయంలో పేరుకి ముందు పవన్ అని కలిపి పెట్టారు చిరు. పవన్ అంటే ఆంజనీయస్వామి మరో పేరు.

న్యాచురల్ స్టార్ నాని:

నాని అసలు పేరు నవీన్ బాబు గంటా. సినిమాల కోసం నాని అని పేరు పెట్టుకోలేదు. చిన్న తనం నుంచే ముద్దు పేరు “నాని” నే. అదే పేరును సినిమాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు.

జగపతి బాబు:

“వీరమాచినేని జగపతి రావు’.. ఇది జగపతి బాబు అసలు పేరు. సినిమాల్లో వచ్చాక, జగపతి బాబు అయారు.

ప్రభాస్:

ప్రభాస్ గారి అసలు పేరు “ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు”, సింపుల్ గా ప్రభాస్ అని పెట్టున్నారు.

సూర్య:

సూర్య అసలు పేరు “శరవణన్ శివకుమార్”

ఇళయ దళపతి విజయ్:

విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.

అజిత్ :

అజిత్ అసలు పేరు “అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం”. మొదటి సినిమా తెలుగులోనే చేసాడు. సినిమా పేరు “ప్రేమ పుస్తకం”.

యష్ :

“కే జీ ఎఫ్ ” అంటూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ నటుడు అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular