
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయింది. అయితే, కొద్దిసేపటి తర్వాత జట్టు సోషల్ మీడియా వింగ్.. తిరిగి అకౌంట్ ను ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. హ్యాక్ అయిన ఆర్సీబీ ట్వీట్టర్ అకౌంట్ నుంచి హ్యాకర్లు ఎలాన్ మస్క్ పోస్ట్ పై కామెంట్ చేశారు. టెస్లా, బిట్ కాయిన్ గురించి వాళ్లు మస్క్ పై దుమ్మెత్తిపోశారు. ఇక అకౌంట్ తిరిగి దక్కించుకున్న ఆర్సీబీ టీం.. పోస్టుకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.