South Indian Music: నేటి భారతీయ సంగీత ప్రపంచానికి… ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలకు ఇళయరాజా (ilayaraja), ఎ.ఆర్. రెహమాన్ (AR Rahman) గురువులు లాంటి వారు. కానీ, ఈ మధ్య నార్త్ ఇండియాలో ‘బెస్ట్ సౌత్ ఇండియన్ మ్యూజిషియన్ ఎ.ఆర్. రెహమాన్’ అంటూ హడావుడి ఎక్కువ అయింది. ఇళయరాజా లాంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంకా రేసులో ఉండగానే.. ఆయనను సైడ్ చేయడం కచ్చితంగా కరెక్ట్ కాదు.
నిజమే ఎ.ఆర్. రెహమాన్ మన సంగీతాన్ని విశ్వవ్యాప్తం గావించి ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ, ఇళయరాజా అందించిన ఎన్నో వైవిధ్యమైన పాటలను ఎలా మర్చిపోగలం ? ఇళయరాజా సంగీతం నేటికీ చాలా వైవిధ్య భరితంగానే ఉంటుంది. ఇప్పటికీ బోలెడన్ని భావాలకు తగిన రాగాలు కూర్చిన సంగీత జ్ఞాన స్వరూపం ఆయన.
జానపద బాణీ నుంచి వెస్టర్న్ కర్ణాటక సంగీతం వరకు ఇలా ప్రతి సంప్రదాయ బాణీ ఇళయరాజా సంగీతంలో ఇమిడిపోయి ఉంటాయి. అందుకే అంతటి గొప్ప స్వరకర్త ఇంకొకరు లేరు అన్నారు. కానీ రెహమాన్ వచ్చాడు. నేషనల్ రేంజ్ లో పేరు ప్రఖ్యాతలు సాధించాడు. అందుకే, కచ్చితంగా ఇద్దరూ గొప్పవాళ్లే.
‘బెస్ట్ సౌత్ ఇండియా మ్యూజిషియన్ గా ఇద్దరూ తగినవారే. కానీ,ఇద్దరిలో ఇళయరాజా కొంచెం ఎక్కువ. ఎందుకంటే.. సంగీతంలో నిశ్శబ్దం చాలా ముఖ్యం. ఆ నిశ్శబ్దంలో నుంచే ఇళయరాజా సంగీతం పుడుతుంది. కానీ నేటి సంగీతం.. డ్రమ్స్, వాయిద్యాల మధ్య గందరగోళ భరితం అయిపోయింది.
ఇలాంటి రోజుల్లో సంగీతం అంటేనే శబ్దం నిశ్శబ్దంల కలయిక అని చెప్పిన ఏకైక వ్యక్తి ఇళయరాజా. అందుకే, రెహమాన్ కూడా ఇళయరాజాని గురువుగా భావిస్తారు.