
ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే మ్యాచ్ పై రోహిత్ శర్మ మాట్లాడాడు. కేకేఆర్ మెరుగైన స్థితిలో ఉంది. గత మ్యాచ్ లో సమిష్టిగా రాణించింది. విజయం సాధించింది. సహజంగానే పూర్తి ఆత్మవిశ్వాసంతో రంగంలోకి దిగుతుంది. కాబట్టి.. నేటి మ్యాచ్ మాకు అంత ఈజీ ఏం కాదు అని అభిప్రాయపడ్డాడు. గత రికార్డులపై తనకు నమ్మకం లేదని, టీ20 మ్యాచ్ లో సదరు రోజు ప్రదర్శన ఎలా ఉందన్న అంశం మీదనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.
మ్యాచ్ జరిగే రోజు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే చాలు. తప్పకుండా విజయం వరిస్తుందని నమ్ముతాను. కేకేటీఆర్ మీద మా రికార్డు బాగుందనేది వాస్తవం. కాబట్టి.. ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తే అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశం ఉంటుంది. అంతే తప్ప గత రికార్డులతో పెద్ద సంబంధం ఉండదని భావిస్తాను అని రోహిత్ శర్మ అన్నాడు.
ఐపీఎల్2021 రెండో అంచెలో భాగంగా తమ తొలి మ్యాచ్ లో గెలుపుతో ఊపు మీదున్న కేకేఆర్ ను కట్టడి చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యచ్ అంత సులువేమీ కాదని అన్నాడు. కాగా ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య గురువారం మ్యాచ్ జరుగనున్న సంగతి తెెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజా సీజన్ రెండో దశ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై మధ్ంయ మ్యాచ్ తో సెప్టెంబరు 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే.