
Shalini Pandey: అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ముద్దుగుమ్మ షాలిని పాండే(Shalini Pandey). ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది షాలిని. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
సినిమాలెన్ని చేసినా కూడా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయింది షాలిని. షాలిని కంటే ప్రీతి అంటేనే గుర్తుపడతారు విజయ్ దేవరకొండ అభిమానులు. 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ముద్దు గుమ్మ ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది. నటనపై ఉన్న ఆసక్తితో నాటకాలలో నటిస్తున్న షాలిని పాండే, అర్జున్ రెడ్డి అనే తెలుగు చలనచిత్రం ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.
ప్రీతి పాత్రతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా వుంటుంది. బర్త్ డే స్పెషల్ గా వెల్వెట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో వెల్వెట్ కలర్ టాప్, ప్యాంట్ వేసుకొని హాట్ హాట్ ఫోజులు ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి.