Heroines Comments On Directors: సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం… బయట నుంచి చూసేవాళ్లకు అదొక హరివిల్లు గా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి స్టార్ హీరోగా మారాడు అంటే దాని వెనకల వాళ్ళు ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొని ఉంటారు. కారణం ఏదైనా కూడా కష్టపడే వాళ్ళకు మాత్రమే సక్సెసులు వస్తాయి. ఒక హీరో సక్సెస్ అయ్యాడు అంటే దాని వెనక చాలా రకాల కష్టాలను అనుభవించి ఉంటాడనే విషయమైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక ఇండస్ట్రీ లో హీరోయిన్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఒక సినిమాతో సక్సెస్ ని సాధిస్తే రెండు మూడు సినిమాలు చేసే ఆఫర్లు వస్తాయి. కానీ భారీ సక్సెస్ ని సాధించిన తర్వాత కూడా ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ హీరోయిన్ ను ఎవ్వరు పట్టించుకోరు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా గుర్తింపును సంపాదించుకున్న ఇలియానా, పూజా హెగ్డే, తాప్సి లాంటి వాళ్లు మాత్రం తెలుగు సినిమా దర్శకులకు సినిమాలు చేయడం రాదని చెప్పారు.అలాగే కథలో కొత్తదనం లేకపోవడం వల్లే హీరోయిన్లను ఎక్స్పోజ్ చేసి సినిమాని సక్సెస్ చేయాలని చూస్తుంటారు అంటూ వాళ్ళు కొన్ని ఘాటు కామెంట్లు చేశారు…
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
హీరోయిన్ అంటే వాళ్లకు ఎక్స్పోజ్ చేసే ఒక వ్యక్తి మాత్రమే తప్ప సినిమా కంటెంట్ కి వాళ్ళకి ఏ సంబంధం ఉండదని వాళ్ళు చెబుతూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా సినిమా రంగంలో స్కిన్ షో చేసిన వారికి మాత్రమే ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి.
కారణం ఏంటి అంటే కొంతమంది ప్రేక్షకులు హీరోయిన్లను చూడడానికే థియేటర్ కి వస్తారని అభిప్రాయపడుతున్నారు. దానివల్లే కొంతమంది దర్శకులు హీరోయిన్స్ కి బికినీలు వేయించి మరి సినిమాలను చేస్తుండడం విశేషం…ఇక హీరోలందరు ఆ కారణాల వల్లే తెలుగు సినిమాలు చేయడం లేదని, బాలీవుడ్ సినిమాలు తమిళ్ సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఇదంతా చూసిన మరి కొంతమంది తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇండస్ట్రీ మీద బ్యాడ్ కామెంట్స్ చేసిన హీరోయిన్స్ ను ఉద్దేశించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆఫర్స్ లేకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ మీద దర్శకుల మీద బ్యాడ్ కామెంట్స్ చేయడం కరెక్టు కాదు అంటూ వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు…