Soundarya Childhood Photos
Star Heroine: సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల ఫొటోలు ఈమధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వారి చిన్న నాటి పిక్స్ ను షేర్ చేస్తూ నటులు ఆకట్టుకుంటున్నారు. అయితే లేటేస్టుగా ఓ హీరోయిన్ కు సంబంధించిన చిన్న నాటి పిక్ ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ బాధాకర విషయమేంటంటే ఈ హీరోయిన్ ప్రస్తుతం మన మధ్య లేరు. కొన్నేళ్ల కిందట ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కానీ హీరోయిన్ గా ఉన్నన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీని ఏలారు. కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించారు. ఇంతకీ ఆ ధ్రువతార ఎవరో తెలుసా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వీళ్లు దశాబ్దాలు పాటు వందల కొద్దీ సినిమాల్లో నటించారు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరించారు. ఒకరికొకరు పోటీ పడి మరీ నటిస్తూ అవార్డులు తెచ్చుకున్నారు. నటనలో ఎంతో పోటీ ఉన్నా.. రియల్ లైఫ్ లో మాత్రం అంతా కలిసి ఉండేవాళ్లు. ఇక ఈ హీరోయిన్ మాత్రం అందరితో కలివిడిగా ఉండేవారు. మంచి మనసుతో ఉన్న ఆమె ఒక్కసారి మరణించడంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
Also Read: Celebrities Costumes: సినిమాలు, సీరియల్ లో వాడిన కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు
పై ఫొటోలో ఉన్న ఆమె ఎవరో కాదు.. అందాల తార సౌందర్య. సినీ తార సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన నటి అయినా.. అచ్చ తెలుగు అమ్మాయిలా నటించి ఇక్కడి మహిళల మనసును దోచుకున్నారు. ఫ్యామిలీ చిత్రాల్లో నటించిన సౌందర్య సినిమాలు ఇప్పటికీ అలరిస్తూ ఉంటాయి. మన ఇంట్లో అమ్మాయి అన్నట్లుగా ఉండే సౌందర్య తెలుగు, తమిళం, కన్నడంతో పాటు కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు.
సౌందర్య 1980 జూలై 17న కర్ణాటక జిల్లాలోని కొలారు జిల్లాలో జన్మించారు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో అందరికీ పరిచయం అయ్యారు. ఆ తరువాత మేడమ్ సినిమాతో స్టార్ అయ్యారు. అక్కడి నుంచి సౌందర్యకు తిరుగులేకుండా పోయింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిలో రాజా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం సినిమాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇందులో ఆమె నటనకు అవార్డులు కూడా వచ్చాయి.అయితే అప్పటికే సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సౌందర్య 2004 ఏప్రిలఓ 17న హెలీ క్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య మరణంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
Soundarya