Visakhapatnam: అనాదిగా మనిషికి, కుక్కకు అవినాభావ సంబంధం ఉంది. మనిషికి ఇష్టమైన పెంపుడు జంతువుల్లో కుక్కకు ప్రధమ స్థానం ఉంటుంది.. పైగా విశ్వాసం మెండుగా ఉంటుంది కాబట్టి, కుక్కను పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. మనుషుల ఆసక్తుల ఆధారంగా రకరకాల కుక్క జాతులను ఆవిష్కరించారు. ఇలా ఓ కుటుంబం తమ ఆసక్తి కోసం ఓ కుక్కను పెంచుకున్నారు. దానికి రకరకాల ఆహార పదార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. రోజుకో గుడ్డు, పెడిగ్రీ, ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు. ఆ ఇంటి వాళ్ళతో కలివిడిగా ఉండే ఆ కుక్క.. ఉన్నట్టుండి చేసిన పని విషాదం నింపింది.
విశాఖపట్నం జిల్లా భీమిలిలో నర్సింగరావు (59) కుటుంబం నివసిస్తోంది. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. వారిలో భార్గవ్ (27) పెద్ద కుమారుడు. అతడు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. నర్సింగరావు కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటున్నది. అయితే ఆ కుక్క రెండు రోజుల క్రితం భార్గవ్ ను ముక్కు మీద, నరసింగరావు కాలిపై కరిచింది. పెంపుడు కుక్క కావడంతో నరసింగరావు కుటుంబం ముందుగా పట్టించుకోలేదు. ఆ తర్వాత రెండు రోజులకు కుక్క చనిపోయింది. దీంతో వారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే యాంటి రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు.
అయితే అప్పటికే నర్సింగరావు మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబీస్ సోకింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాలేయం, మెదడు, ఇతర శరీర భాగాలకు రేబీస్ సోకడంతో ఆరోగ్యం విషమించి మరణించారు. పెంపుడు కుక్క కరవడంతో తండ్రీ కొడుకు కన్నుమూయడంతో భీమిలి ప్రాంతంలో విషాదం నెలకొంది.
అయితే ఆ కుక్కకు గతంలోనే రేబీస్ సో కిందట. ఈ విషయాన్ని నరసింగరావు కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. ఆ రేబిస్ వైరస్ ఆ కుక్క లాలాజలంలో ఉండడంతో కరిచిన వెంటనే.. ఆ వైరస్ నర్సింగరావు, ఆయన కుమారుడి శరీరంలోకి ప్రవేశించింది. కాలేయం, ఇతర అవయవాల పని తీరుపై ప్రభావం చూపించింది. ఫలితంగా వారు అకాలంగా మరణించారు.