Pokiri Movie: సినిమాల్లో ఒక్కోసారి గమ్మత్తైన విషయాలు కూడా జరుగుతుంటాయి. ఒకరికి రావాల్సిన సినిమా మరొకరికి వెళ్తుంటుంది. ఒకరికి రావాల్సిన హిట్ మరొకరి సొంతం అవుతుంది. ఇలా ఎన్నో చిత్ర విచిత్రాల సమ్మేళనమే సినిమా రంగం. ఒక హీరోతో చేయాల్సిన సినిమా మరొకరితో చేయడం తెలిసిందే. ఈ కోణంలో ప్రస్తుత స్టార్ హీరో మహేశ్ బాబుకు మొదట సూపర్ హిట్ ఇచ్చిన సినిమా పోకిరి. తెలుగు సినిమా రంగంలో ఓ వండర్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచే మహేశ్ బాబు స్టార్ డమ్ వచ్చింది. అంతవరకు మహేశ్ కు ఒక్క హిట్ కూడా దక్కలేదు. దీంతో సందిగ్ధంలో ఉన్న మహేశ్ స్థాయిని పోకిరి పెంచేసింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో రూ.40 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది.

అంతకు ముందు మహేశ్ బాబుకు చెప్పుకోదగ్గ హిట్లు లేవు. ఏదో అనే రేంజ్ లో యావరేజ్ గా తన సినిమాలు ఆడేవి. దీంతో మహేశ్ బాబు కూడా తనకు చెప్పుకోదగ్గ హిట్ లేదని బాధ పడేవాడు. ఆ సమయంలో పోకిరి సినిమా తన అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీన్ని హిందీలో కూడా తీశారు. అంతటి ఘన విజయం సాధించడంతో మహేశ్ బాబుకు తిరుగు లేకుండా పోయింది. తరువాత వచ్చిన ఒక్కడుతో మహేశ్ బాబు రేంజ్ మరింత పెరిగింది.
Also Read: Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ ఉండదట?
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు పోకిరి సినిమా ఫస్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేశ్ తో తీయాలనుకోలేదట. పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయాల్సి వచ్చిందట. పోకిరి సినిమాను ప్రస్తుత ప్రతినాయకుడు సోనూసూద్ తో చేయాలని అనుకున్నాడట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దీంతో మహేశ్ తో చేసి హిట్ సాధించాడు. దీంతో పరిశ్రమలో అటు మహేశ్ కు ఇటు దర్శకుడు పూరీ జగన్నాథ్ కు మంచి హిట్ తెచ్చిపెట్టిన చిత్రంగా పోకిరి నిలవడం గమనార్హం.

అలా చిత్ర పరిశ్రలో కొన్ని సంచలనాలు నమోదవుతాయి. కొన్నింటిని మనం ఎంత కాదనుకున్నా మనకే దక్కుతాయి. కొన్ని కావాలనుకున్నా మన దరికి చేరవు. విధి అంటే అదే మరి. అలా పోకిరి సినిమా మహేశ్ బాబుకు ఓ మైలురాయిలా నిలిచింది. తెలుగు చలన చిత్ర రంగంలో పెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డులకెక్కింది. సోనూసూద్ కు దక్కాల్సిన విజయం మహేశ్ బాబుకు దక్కడం విశేషం. సోనూసూద్ మహేశ్ బాబుతో అతడు సినిమాలో నటించి మంచిమార్కుల కొట్టేశాడు. అప్పటి నుంచే తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు వరుసగా రావడం తెలిసిందే.
Also Read:Singer Chinmayi Sripada: సింగర్ చిన్మయి ఇంస్టాగ్రామ్ డిఎమ్ లో మగాళ్ల ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు… అకౌంట్ సస్పెండ్
Recommended Videos
[…] […]
[…] […]
[…] […]