RGV Tweet On Draupadi Murmu: వివాదాల వర్మ ఎప్పుడూ ఎవరినో ఒకరిని గెలుకుతూనే ఉంటాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థినే టార్గెట్ చేశాడు. దీంతో బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జూన్ 24న బీజేపీ తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రకటించింది. మహాభారతంలో ద్రౌపది పాండవుల ఐదుగురు భార్యగా ఉన్నారు. ఇదే అర్థం వచ్చేలా వర్మ ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? ముఖ్యంగా కౌరవులు ఎవరు?’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. వర్మపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.

బీజేపీ నాయకులు వర్మ ట్వీట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. బీజేపీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, నందీశ్వర్ గౌడ్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భారత అత్యున్నత పదవి అలకరించనున్న ఓ గిరిజన మహిళను అవమానించాడంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో, ఈ విషయంలో వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక వర్మపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Pokiri Movie: పోకిరిని మిస్ చేసుకున్న ఆ స్టార్ ఎవరు?
తన ట్వీట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వర్మ స్పందించారు. తన ఉద్దేశం ఏమిటో వివరించారు. మహాభారతంలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ద్రౌపది. ఈ పేరు చాలా అరుదుగా పెట్టుకుంటారు. ద్రౌపది అనే పేరు వినగానే ఆమె చుట్టూ అల్లుకున్న కొన్ని పాత్రలు గుర్తొచ్చాయి. అంతకు మించి దురుద్దేశం ఏమీ లేదు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేయలేదు.. అంటూ పోస్ట్ పెట్టారు. ఇక వర్మ తీరు చూసిన జనాలు అడుసు తొక్కనేల కాలు కడగలననేల అంటున్నారు. అనవసరమైన ట్వీట్స్ తో వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

తన ట్వీట్ వివాదాస్పదం అవుతుందని వర్మకు బాగా తెలుసు. ద్రౌపది అంటే హిందువులకు సెంటిమెంట్ కూడాను. మతపరంగానో, రాజకీయంగానే వర్మ ట్వీట్ రచ్చ చేస్తుందని తెలిసిన వర్మ అలాంటి కామెంట్ చేశాడు. వర్మ ఎప్పుడూ అటెన్షన్ కోరుకుంటున్నారు. ఏదో విధంగా తన పేరు జనాల్లో నానాలని ఆశపడతారు. దానికి వివాదమే బెస్ట్ ఛాయిస్ అనుకుంటారు. ఇప్పటి వరకు వర్మ జీవితంలో వందల కాంట్రవర్సీలు ఉన్నాయి. అనేకమార్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి.
Also Read:Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ ఉండదట?
Recommended Videos
[…] […]