Pushpa 2:సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. అందులో తగ్గేదేలే అని డైలాగ్ అందరిని అదరగొట్టింది. అందరికి మేనరిజంగా మారింది. దీంతో అందరి నోట తగ్గేదేలే అనే మాట కామన్ అయిపోయింది. కొన్ని కొన్ని మాటలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. గతంలో చిరంజీవి ప్రతి సినిమాకు ఇలాంటి డైలాగులతో ప్రేక్షకులను అలరించేవారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అదే బాటలో నడుస్తున్నాడు. రేసుగుర్రం చిత్రంలో ‘ద్యావుడా’ అనే డైలాగు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇప్పటికి కూడా పలువురు ద్యావుడా అనే డైలాగును మరిచిపోవడం లేదు. అదే కోవలో తగ్గేదేలే అనే డైలాగు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అల్లు అర్జున్ మేనరిజానికి అందరు ఫిదా అవుతున్నారు.

దర్శకుడు సుకుమార్ పుష్ప2 పనిలో నిమగ్నమయ్యారట. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఆగస్టు నుంచి పుష్ప-2 షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో ‘తగ్గేదేలే’ అనే డైలాగు సృష్టించిన సునామీ అందరికి తెలిసిందే. కానీ పుష్ప-2లో మాత్రం ఈ డైలాగును ఉంచడం లేదట. మరో డైలాగ్ తీసుకోవాలని సుకుమార్ చూస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
పుష్ప-2ను కూడా అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ గా చూపించాలని సుకుమార్ తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కథలో బలమైన క్యారెక్టర్లు తీసుకుని సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాలని దర్శకుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తగ్గేదేలే అనే డైలాగుకు బదులుగా చిత్తూరు యాసలో మరో డైలాగును పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ మదిలో ఏముందో అనే విషయం ఎవరికి తెలియడం లేదు.

మొత్తానికి పుష్ప-2లో కథాపరంగా వచ్చే మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. దీనికి గాను దర్శకుడు కథ ఎలా మలుపు తిప్పుతారో అన్న ఆసక్తి నెలకొంది.. మొదటి పార్టులో ఉన్న తగ్గేదేలే డైలాగును మాత్రం రెండో పార్టులో ఉంచకుండా వేరే డైలాగును తీసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప-2 కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా? లేక ఇదివరకే వచ్చిన సినిమాల్లా అవుతుందా అనేదే తేలాల్సి ఉంది. సుకుమార్ శక్తి మీద నమ్మకంతోనే పుష్ప-2 కూడా ముందుకు సాగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:Shruti Haasan Tattoo: అక్కడ గులాబీ టాటూ వేయించుకున్న శృతి… అయితే క్యాబేజీ అయ్యిందంటూ క్రేజీ కామెంట్
Recommended Videos
[…] Also Read: Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘త… […]
[…] Read:Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘త… Recommended […]
[…] Read:Pushpa 2: షాకింగ్: పుష్ప2లో అల్లు అర్జున్ ‘త… Recommended […]