https://oktelugu.com/

‘కలియుగ కర్ణుడి’కి పాలాభిషేకం.. అందరికీ ఆదర్శం !

కరోనా మహమ్మారి దావానలంగా దేశం మొత్తం వ్యాప్తి చెంది, జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్లు పొట్టన పెట్టుకుంటూ దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తోంది. పేద ప్రజల పరిస్థితి మరీ దారుణమైంది. కరోనా సోకి సరైన వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి అండగా నిలబడిన వ్యక్తి ‘సోనూసూద్’. ప్రతి ఒక్కరు సోనూసూద్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో చిత్తూర్ జిల్లాలో శ్రీకాళహస్తి […]

Written By:
  • admin
  • , Updated On : May 20, 2021 / 05:23 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి దావానలంగా దేశం మొత్తం వ్యాప్తి చెంది, జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్లు పొట్టన పెట్టుకుంటూ దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తోంది. పేద ప్రజల పరిస్థితి మరీ దారుణమైంది. కరోనా సోకి సరైన వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి అండగా నిలబడిన వ్యక్తి ‘సోనూసూద్’.

    ప్రతి ఒక్కరు సోనూసూద్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో చిత్తూర్ జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణంలో సోను సూద్ చిత్రపటానికి పాలాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం జరిపించారు పులి శ్రీకాంత్. సమాజంలో మూకుమ్మడి సమస్య వస్తే ఎవరైనా ప్రభుత్వానికి చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు ప్రజలు తమ సమస్యకి పరిష్కారం చూపమని సోనూసూద్ ను అడుగుతున్నారు.

    పైగా సోను సూద్ కి చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుందనే నమ్మకం ప్రజలలో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే లక్షల మందికి అనేక విధాలుగా సోనూసూద్ సాయం చేశారు. సినిమాలలో విలన్ పాత్రలలో క్రూరుడిగా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో హీరోలా అందర్నీ ఆదుకోవటం చూసి ఆయనకు ప్రజలు అభిమానులుగా మారిపోతున్నారు.

    ఆపద సమయంలో ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తోన్న సోనూసూద్ “కలియుగ కర్ణుడు” అంటూ బిరుదులు ఇస్తున్నారు. సోనూసూద్‌ కి విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి పూజలు నిర్వహించిన సంఘటనలు కూడా మనం చూశాము. ఆ గౌరవానికి ‘సోనూ సూద్‌ నిజంగా అర్హుడే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు సాయం చేయడం అంటే మాటలు కాదు. సోనూసూద్ ఇలాగే ముందుకు సాగాలని కోరుకుందాం.