https://oktelugu.com/

‘నిధి అగర్వాల్’ను తోస్తూ సోనూసూద్‌ కన్నీళ్లు !

కరోనా కష్ట సమయంలో చేసిన సేవకు కలియుగ కర్ణుడు అంటూ సోనూసూద్‌ కి నెటిజన్లు ఒక బిరుదు ఇచ్చారు. కాగా తాజాగా సోనూసూద్‌ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక సాంగ్ షూట్ చేయడానికి చాలా కష్టపడాలి అని, అయితే ఆ సాంగ్ హిట్ అయినప్పుడు, వచ్చే సంతోషం చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే సరదాగా కెమెరా ట్రాలీ పై హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎక్కించుకుని, ఆ ట్రాలీని తోస్తూ మొత్తానికి […]

Written By:
  • admin
  • , Updated On : August 12, 2021 / 05:13 PM IST
    Follow us on

    కరోనా కష్ట సమయంలో చేసిన సేవకు కలియుగ కర్ణుడు అంటూ సోనూసూద్‌ కి నెటిజన్లు ఒక బిరుదు ఇచ్చారు. కాగా తాజాగా సోనూసూద్‌ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక సాంగ్ షూట్ చేయడానికి చాలా కష్టపడాలి అని, అయితే ఆ సాంగ్ హిట్ అయినప్పుడు, వచ్చే సంతోషం చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే సరదాగా కెమెరా ట్రాలీ పై హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎక్కించుకుని, ఆ ట్రాలీని తోస్తూ మొత్తానికి సోనూసూద్ సరదాగా ఈ వీడియో చేశాడు.

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ సోనూసూద్ – నిధి అగర్వాల్ పై తీసిన సాంగ్ ఏమిటంటే.. ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ సాంగ్. 1990 ల్లో వచ్చిన ఈ పాట అప్పట్లో సూపర్‌ హిట్ అయింది. ఈ సాంగ్‌ ను సోనూసూద్ – నిధి అగర్వాల్ పై రీక్రియేట్ చేస్తూ దర్శకురాలు ఫరాఖాన్ పాటను తెరకెక్కించింది.

    అన్నట్టు యూట్యూబ్‌ లో ఈ సాంగ్ ఇప్పటికే మంచి వ్యూస్ ను సాధించింది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆధరణ దక్కించుకున్న పాటగా కూడా ఈ పాట రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాటతో సోనూసూద్ మరింతగా పాపులర్ అయిపోయాడు. నిధి అగర్వాల్‌ మరియు సోనూసూద్‌ లు పాటలో చక్కని ప్రతిభ కనబర్చారు. మొత్తానికి ఈ పాట సక్సెస్‌ అవడంతో సోనూసూద్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

    అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా యూట్యూబ్ కోసం సాంగ్స్ లో నటించారు. ఇప్పుడు వారి లిస్ట్ లోనే సోను సూద్ కూడా చేరాడు. ఇక ఈ సాంగ్ లో నిధి అగర్వాల్ , సోనూ సరసన హీరోయిన్ గా నటించడం అంటే నిజంగా విశేషమే. ఎందుకంటే… నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.