Bigg Boss Telugu 8 : గత బిగ్ బాస్ సీజన్స్ లో లవ్ ట్రాక్ బాగా సక్సెస్ అయ్యింది. ఆడియన్స్ అమితాసక్తితో చూసేవారు. ముఖ్యంగా సీజన్ 3, సీజన్ 4 , సీజన్ 5 లో లవ్ ట్రాక్స్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ గత రెండు సీజన్స్ లో బిగ్ బాస్ వాటిని ప్రోత్సహించలేదు, లేకపోతే సాధారణంగా జరిగిందో తెలియదు కానీ, లవ్ ట్రాక్స్ జరగలేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం లవ్ ట్రాక్ హద్దులు దాటే లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా సోనియా ఆకుల ఓవర్ యాక్షన్ ని ఆడియన్స్ చూడలేకపోయారు. ఈమె ఒకరితో కాదు ఏకంగా ఇద్దరితో లవ్ ట్రాక్ నడుపుతుంది. అంతే కాదు ఈమె నోరు కూడా చిన్నది కాదు. వాదించుకోడం లో హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు ఈమె. నీతులు కూడా చాలా చక్కగా చెప్తుంది కానీ, ఆమె మాత్రం అనుసరించదు. విష్ణు ప్రియా ని అన్యాయం గా ఏమి అనకపోయినా కూడా అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తుంది అని అనేస్తుంది, కానీ ఈమె మాత్రం హౌస్ లో నిఖిల్, పృథ్వీ రాజ్ తో ప్రేమాయణం నడుపుతుంది.
వాళ్ళిద్దరి మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఈమె కనపడే వీడియోస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఈమె నిఖిల్ తొడల మీద చేతులు వేసి కనిపించింది. అంతే కాదు అర్థ రాత్రులు వీళ్లిద్దరు డీప్ గా కౌగిలించుకోవడం కెమెరాలకు చిక్కాయి. హౌస్ లో 100 కి పైగా కెమెరాలు ఉన్నాయి అనే విషయాన్నే మర్చిపోయింది ఈమె. విష్ణు ప్రియా ని నోటికి వచ్చినట్టు ఇప్పటికీ మాట్లాడుతుంది, ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మీద కూడా నోరు పారేసుకుంది, అసలు ఆ అమ్మాయి క్యారక్టర్ ని ఎన్ని విధాలుగా అవమానించాలో, అన్ని విధాలుగా అవమానించింది, ఇప్పటికీ అవమానిస్తూనే ఉంది.
కానీ ఈమె మాత్రం క్యారక్టర్ పరంగా దిగజారి మగవాళ్ళతో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించొచ్చు. ఈమె స్పీడ్ చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ని కూడా డామినేట్ చేసేలా ఉంది. ఆ సీజన్ లో సిరి షణ్ముఖ్ కి పెట్టిన ముద్దులు, ఇచ్చిన హగ్గులకు లెక్కే లేదు. ఈ సీజన్ లో హగ్గుల విషయం లో సోనియా సిరి కి పోటీ ని ఇచ్చేస్తుంది. కానీ ముద్దుల విషయం లో మాత్రం ఇంకా ప్రారంభించలేదు. నిఖిల్ ని ఒకరోజు సిగరెట్లు ఆపేయ్, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని ఆల్రెడీ ఆమె ఆఫర్ కూడా ఇచ్చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఆ ముచ్చట కూడా తీరొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు చూసే ఇలాంటి షోస్ లో కాస్త డీసెంట్ గా ప్రవర్తించండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బయటకి వచ్చిన తర్వాత సోనియా తన మీద జరిగిన ఈ నెగటివిటీ ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో.