Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ను పట్టుకొని గంటసేపు ఎన్టీఆర్ ఎందుకు ఏడ్చాడు.. ఓదార్చడం ఎవరివల్ల ఎందుకు కాలేదు..?

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోలు వాళ్లకున్న ఇమేజ్ లోనే సినిమాలను చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి. కానీ కొంత మంది హీరోలు మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తారు...

Written By: Gopi, Updated On : September 14, 2024 8:35 am

Rajendra Prasad-Jr.NTR

Follow us on

Rajendra Prasad : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట కిరీటి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఒక వెలుగు వెలిగాడు. ఇక రాజేంద్రప్రసాద్ చాలా కాలం పాటు కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఈయన సినిమాల కోసం యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూసేవారు. అలాంటి రాజేంద్రప్రసాద్ సంవత్సరం నుంచి హీరోగా తన మార్కెట్ ని కోల్పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్టార్ హీరోలందరి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వరుస సినిమాలను చేసి సక్సెస్ లను పొందడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో సినిమా భారీ విజయాన్ని సాధించి ఎన్టీఆర్ కి ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అయితే చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా ఈ సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ సాఫ్ట్ క్యారెక్టర్ లో కూడా నటించగలరు అంటూ తెలుగు ప్రేక్షకులు అతన్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్రప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్ గా నటించాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చనిపోయే ఒక సీన్ ఉంటుంది. ఇక దీని మీద రీసెంట్ గా రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు.

ఇక నాన్నకు ప్రేమతో సినిమాలో తను చనిపోయే సమయానికి ఆయన చాలా నవ్వుతూ కండ్లు మూస్తాడు. ఇక సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిన ఎన్టీయార్ కొద్దిసేపటి వరకు ఏడుస్తూనే ఉన్నాడట. ఎంతమంది వచ్చి ఓదార్చిన కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏడవడం ఆపలేదట. దానికి కారణం ఏంటి అంటే రాజేంద్రప్రసాద్ కి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ అని చెప్పాడు.

అలాగే చాలా రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి తనకి మధ్య ఒక మంచి బాండింగ్ అయితే కుదిరింది. ఇక దానివల్లే ఎన్టీయార్ తన క్యారెక్టర్ మరణించినప్పుడు రియల్ గా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అంటూ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందో తెలియజేయదానికి రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని అయితే గుర్తు చేశాడు. ఇక రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ మధ్య చాలా మంచి రిలేషన్ షిప్ ఉందనేది వాస్తవం.