Bigg Boss Telugu 8: ప్రతీ సీజన్ లోనూ బిగ్ బాస్ హౌస్ లోకి 20 మంది కంటెస్టెంట్స్ ని పంపేవారు. కానీ ఈ సీజన్ కి వచ్చేసరికి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ ని మాత్రమే లోపలకు పంపారు. ఇదేంటి ఈ సీజన్ మినీ సీజన్ కాదు కదా, 16 వారాలు అన్నారు, కానీ కేవలం 9 వారాలకు సరిపడ కంటెస్టెంట్స్ ని మాత్రమే పంపారు, అసలు ఏమి జరుగుతుంది అని బిగ్ బాస్ షో చూసేవారికి అర్థం కాలేదు. సోషల్ మీడియా వాడే వారికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్స్ త్వరలో రాబోతున్నారు అనే విషయం తెలుసు. కానీ సాధారణ బుల్లితెర ప్రేక్షకులకు ఇలాంటివి తెలియవు కదా, ఈ సీజన్ మొత్తం ట్విస్టులతోనే ఉంటుందని నాగార్జున ఇప్పటికి వంద సార్లు చెప్పి ఉంటాడు. ఆ ట్యాగ్ లైన్ ని నిజం చేయడానికే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ విషయాన్ని ఇంకా గోప్యంగానే ఉంచాడు నాగార్జున.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 21 వ తేదీన వైల్డ్ కార్డు ద్వారా ఆరు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాం. కమెడియన్స్ జాబితా లో సీజన్ 4 కంటెస్టెంట్ అవినాష్ ఈ సీజన్ లో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. సీజన్ 4 లో కూడా ఆయన హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారానే అడుగుపెట్టాడు. అవినాష్ వస్తే ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ గా ఉంటుందని ఆయనని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు పంపేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చి మొదటి వారం లోనే ఎలిమినేట్ అయిన నయనీ పావని ఈ సీజన్ లో మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుంది అని సమాచారం. గత సీజన్ లో ఈమె ఎలిమినేషన్ చాలా అన్యాయం అనిపించింది, అందుకే ఈ సీజన్ లో ఆమెకి మరో అవకాశం కల్పించారు.
ఇక ఈ సీజన్ ద్వారా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న మూడవ కంటెస్టెంట్ అంజలి పవన్. ఈమె సీజన్ ప్రారంభం నుండే రావాల్సి ఉంది కానీ, బిగ్ బాస్ టీం రిక్వెస్ట్ చేయడం తో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతుంది. ఇక విష్ణు ప్రియా కి ప్రాణ స్నేహితురాలిగా పిలవబడే రీతూ చౌదరీ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోతున్నట్టు సమాచారం. ఈమెతో పాటు గుప్పెనదంతా మనసు లో జగతి పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన జ్యోతి రాయ్, అలాగే ఒక ఫిమేల్ మోడల్ కూడా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నారని సమాచారం. వీరిలో ఒకవేళ ఎవరైనా డ్రాప్ అయితే సీజన్ 3 కంటెస్టెంట్ రోహిణి వారి బదులుగా వచ్చే అవకాశం ఉందట. త్వరలోనే ఈ లిస్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రానున్నాయి.