https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : నిఖిల్ చేసిన ఆ తెలివైన పని వల్లే సోనియా ఈరోజు ఎలిమినేట్ అయ్యిందా..? అడ్డంగా దొరికిపోయాడుగా!

వాస్తవానికి నిఖిల్ మనస్తత్వం ఎలాంటిదంటే, అందరితో చాలా బాగా ఉండాలని అనుకుంటాడు. అందరినీ తన సొంత మనుషులుగా చేసుకోవాలని అనుకుంటాడు. అలా సోనియా కి కూడా కనెక్ట్ అయ్యాడు. కానీ సోనియా నిఖిల్ ని వాడుకొని హౌస్ లో మంచి ఓటింగ్ తో నెట్టుకురావాలని అనుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 07:04 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మన అందరికీ బాగా స్ట్రాంగ్ అనిపించేవారిలో ఒకరు నిఖిల్. హౌస్ లో టాస్కులు ఆడే విషయంలో నిఖిల్ కింగ్ అనే చెప్పాలి. వరుసగా మూడు సార్లు ఆయన చీఫ్ అయ్యాడంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో టాస్కులు ఆడుతాడు అనేది. అయితే నిఖిల్ సోనియా మాయలో ఉన్నాడని, ఆమె మాటలకు ప్రభావితం అయ్యి తన గేమ్ ని సర్వనాశనం చేసుకుంటున్నాడని అందరూ అనుకున్నారు. వాస్తవానికి నిఖిల్ మనస్తత్వం ఎలాంటిదంటే, అందరితో చాలా బాగా ఉండాలని అనుకుంటాడు. అందరినీ తన సొంత మనుషులుగా చేసుకోవాలని అనుకుంటాడు. అలా సోనియా కి కూడా కనెక్ట్ అయ్యాడు. కానీ సోనియా నిఖిల్ ని వాడుకొని హౌస్ లో మంచి ఓటింగ్ తో నెట్టుకురావాలని అనుకుంది.

    ఆమె అనుకున్న గేమ్ ప్లాన్ లో సక్సెస్ అయ్యింది. నిఖిల్ చీఫ్ గా తీసుకునే ప్రతీ నిర్ణయం లో సోనియా ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. అభయ్ ఎలిమినేట్ అయ్యే ముందు నిఖిల్ కి ఈ విషయం కూడా చెప్తాడు. బయట సోనియా నిన్ను ప్రభావితం చేసి తన గేమ్ కోసం వాడుకున్నట్టు చాలా గలీజ్ గా వెళ్తున్నట్టు ఉంది అని అంటాడు. అప్పుడు నిఖిల్ కూడా ‘నిజమే మామా..ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు’ అని అంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే బిగ్ బాస్ నిఖిల్ కి ఒక చీఫ్ అయిన కారణంగా ఒక అద్భుతమైన పవర్ ఇస్తాడు. నామినేట్ అయిన ఇంటి సభ్యులలో ఎవరినో ఒకరిని నామినేషన్స్ నుండి తప్పించొచ్చు అని అంటాడు. నిఖిల్ సోనియా ని సేవ్ చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు కానీ, ఆయన నైనికా ని సేవ్ చేసి అందరినీ షాక్ కి గురి చేస్తాడు. కానీ నిఖిల్ ఆ పని కావాలని చేసినట్టుగా ఇప్పుడు అందరికీ అనిపించింది. సోనియా ని బయటకు పంపేందుకు ఆయన వేసిన ఎత్తుగడగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. సోనియా ఆట తీరుకి ఆమెకు బయట బాగా నెగటివిటీ పెరిగింది అనేది నిఖిల్ కి అర్థమైంది. ఆమె నుండి బయట పడేందుకు ఇదే సరైన సమయం అని ఆయన సోనియా ని సేవ్ చేయలేదు. ఆయన ఎత్తుగడ ఫలించింది, సోనియా చివరికి ఎలిమినేట్ అయ్యింది.

    అయితే నిఖిల్ నైనికా ని సేవ్ చేసినప్పుడు ‘ ఆయన సోనియా, పృథ్వీ తో కలిసి గ్రూప్ గేమ్ ఆడడం లేదు అని చెప్పుకోవడానికి చేసినట్టుగానే అనిపించింది’ అని ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ గత వారం మొత్తం ఆయన గ్రూప్ గేమ్ ఆడాడు. సోనియా నిర్ణయాలకు నిఖిల్ అడ్డు చెప్తే ఎక్కడ ఆమె బాధపడుతుందో, గొడవకు దిగుతుందో అనే భయం తో ఆమె నిర్ణయాలకు ప్రభావితం అవుతున్నట్టు నటించాడు. చివరికి ఒక స్ట్రాటజీ ప్రకారం ఆమెని బయటకు నెట్టి సక్సెస్ అయ్యాడు. నిఖిల్ ఆరోజు సోనియా ని సేవ్ చేసి ఉండుంటే, మరో రెండు మూడు వారాలు ఆమెని భరించాల్సి వచ్చేది. నిఖిల్ గేమ్ మొత్తం పూర్తిగా చెడిపోయేది. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి రేపటి నుండి కొత్త నిఖిల్ ని చూడొచ్చు.