https://oktelugu.com/

Nayanathara : 50 సెకండ్స్ కోసం 5 కోట్లు..దరిదాపుల్లో మరో హీరోయిన్ లేదు..చరిత్ర తిరగరాసిన నయనతార!

రీసెంట్ గా ఈమె ప్రముఖ డీటీహెచ్ సంస్థ 'టాటా స్కై' కి సంబంధించి ఒక యాడ్ లో కనిపించింది. ఈ యాడ్ లో ఆమె 50 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. ఈ 50 సెకండ్ల కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?, అక్షరాల 5 కోట్ల రూపాయిలు. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకి 3 నుండి 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 07:12 PM IST

    Nayanathara

    Follow us on

    Nayanathara : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు నయనతార. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘చంద్రముఖి’ అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో నయనతార కి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వెల్లువలాగా కురిసాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆమె వినియోగించుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. స్టార్ అయ్యాక ఈమె ఎంచుకున్న ప్రతీ కథ నటనకు ప్రాధాన్యం ఉన్నవే అవ్వడం విశేషం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నటనకు ప్రాధాన్యత లేని పాత్ర వస్తే నిర్మొహమాటంగా ‘నో’ అని సమాధానం చెప్పడం నయనతార స్టైల్. అందుకే ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది.

    ఏడాదికి కొత్త హీరోయిన్లు ఎంతమంది పుట్టుకొస్తున్నప్పటికీ నయనతార ఇమేజ్ పెరిగిందే కానీ, ఇసుమంత కూడా తగ్గలేదు. ఈమెకు ఉన్న డిమాండ్ ని చూసి దర్శక నిర్మాతలు ఈమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సినిమా బడ్జెట్ కి తగ్గట్టుగా ఈమె తన రెమ్యూనరేషన్ ని 10 నుండి 15 కోట్ల రూపాయిల వరకు తీసుకుంటుంది. సౌత్ ఇండియా లో ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఏ హీరోయిన్ కూడా తీసుకోదు.ఇది ఇలా ఉండగా అందరూ హీరోయిన్స్ లాగానే నయనతార కూడా ప్రముఖ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఆమెదే పై చెయ్యి. రీసెంట్ గా ఈమె ప్రముఖ డీటీహెచ్ సంస్థ ‘టాటా స్కై’ కి సంబంధించి ఒక యాడ్ లో కనిపించింది. ఈ యాడ్ లో ఆమె 50 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. ఈ 50 సెకండ్ల కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?, అక్షరాల 5 కోట్ల రూపాయిలు. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకి 3 నుండి 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ నయనతార అంత మొత్తం డబ్బులు కేవలం ఒక యాడ్ కోసం తీసుకుందట.

    కేవలం ఈ ఒక్క యాడ్ కి మాత్రమే కాదు, ఏ యాడ్ వీడియో కి అయినా ఆమె ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి అయితే అయితే ఈమె గంటకి కోటి రూపాయిలు తీసుకుంటుందని టాక్. దీనిని బట్టి హీరో హీరోయిన్లకు సినిమాల్లో కంటే కమర్షియల్ యాడ్స్ లో ఎంత లాభాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార తమిళం లో నాలుగు సినిమాలు , మలయాళం లో ఒక్క సినిమా చేస్తుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఈమె పలు సినిమాలను నిర్మిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో ఆమె ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.