https://oktelugu.com/

కొడుకు జైలుకు పంపినా పోతాను: స్టార్ హీరో తండ్రి

స్టార్ హీరోకు, ఆ తండ్రికి అస్సలు పడడం లేదు. ఇప్పుడు అదే మీడియాలో హైలెట్ గా మారింది. తండ్రికి, కొడుకుకు వచ్చిన ఈ విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ఆయన తండ్రి చంద్రశ్రేఖర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్న ప్రచారం సాగుతోంది. ఇద్దరూ పరస్పర విరుద్ధ వాదనలు వినిపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ తాజా ఇంటర్వ్యూలో విజయ్ పై తండ్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 05:17 PM IST
    Follow us on

    స్టార్ హీరోకు, ఆ తండ్రికి అస్సలు పడడం లేదు. ఇప్పుడు అదే మీడియాలో హైలెట్ గా మారింది. తండ్రికి, కొడుకుకు వచ్చిన ఈ విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ఆయన తండ్రి చంద్రశ్రేఖర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్న ప్రచారం సాగుతోంది. ఇద్దరూ పరస్పర విరుద్ధ వాదనలు వినిపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తాజా ఇంటర్వ్యూలో విజయ్ పై తండ్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ తనపై చర్య తీసుకుంటే అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు.. “విజయ్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరో కావచ్చు, కానీ అతను ఎప్పుడూ నా కొడుకుగానే ఉంటాడు. నేను చేస్తున్నది నా కొడుకు యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే. విజయ్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆలోచనను ఇష్టపడకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా దాని ప్రాముఖ్యతను గ్రహించి ఒక రోజు నా దగ్గరకు వస్తాడు. విజయ్ నన్ను జైలుకు పంపితే, తన తండ్రిని జైలుకు పంపిన కొడుకుగా చరిత్ర సృష్టించడం ముగుస్తుంది ”అని ఎస్‌ఐ చంద్రశేఖర్ అన్నారు.

    Also Read: ‘ఆది పురుష్’కి సప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ !

    సీనియర్ దర్శకుడు అయిన చంద్రశేఖర్ తన కొడుకు హీరో విజయ్ పై చేసిన తాజా వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చాయి. కొడుకు, తండ్రి మధ్య రాజకీయ పార్టీ విషయమై పరస్పర విరుద్ధ వాదనలు తమిళనాట రాజకీయాన్ని వేడెక్కించాయి. చంద్రశేఖర్ తన కొడుకు పేరుతో ఒక రాజకీయ పార్టీని నమోదు చేశాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ కొన్ని రోజుల క్రితం విజయ్ ఒక పత్రికా నోట్ జారీ చేశాడు. తన తండ్రి రాజకీయ పార్టీ కోసం తన పేరు మరియు ఫొటోలను ఉపయోగించరాదని హెచ్చరించాడు.

    Also Read: ఎట్టకేలకు ‘బంగార్రాజు’కి క్లారిటీ ఇచ్చాడు !

    తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని.. రావట్లేదనే వార్తలు తమిళనాట హీట్ పెంచాయి.ఈ క్రమంలోనే విజయ్ పేరు మీద ఆయన తండ్రి ఒక రాజకీయ పార్టీని స్థాపించడం.. దాన్ని విజయ్ వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కు, అతడి తండ్రి ఎస్.ఐ.చంద్రశేఖర్ మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు గుప్పుమన్నాయి.కోలీవుడ్ సర్కిల్స్ లో ఇదే ఇప్పుడు కోడై కూస్తున్నారు.