https://oktelugu.com/

ఎట్టకేలకు ‘బంగార్రాజు’కి క్లారిటీ ఇచ్చాడు !

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా చాలా కీలకమైనది. నాగ్ కెరీర్ ముగిసింది అనుకుంటున్న టైంలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఒకవిధంగా ఈ డికేడ్ లో నాగ్ కెరీర్ ను నిలబెట్టిన సినిమా అది. పైగా 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకోవడంతో మంచి సినిమాగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన […]

Written By:
  • admin
  • , Updated On : November 9, 2020 / 05:08 PM IST
    Follow us on


    కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా చాలా కీలకమైనది. నాగ్ కెరీర్ ముగిసింది అనుకుంటున్న టైంలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఒకవిధంగా ఈ డికేడ్ లో నాగ్ కెరీర్ ను నిలబెట్టిన సినిమా అది. పైగా 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకోవడంతో మంచి సినిమాగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన రావడంతో.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కలయికలో ఆ సినిమానికి సీక్వెల్ తీయాలని గత నాలుగేళ్ళ నుండి స్క్రిప్ట్ పై యుద్ధం చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అయితే ఎంత చేసినా.. ఎన్ని రకాలుగా కథను మార్చినా నాగార్జునను మాత్రం ఒప్పించలేక సినిమాని మొదలుపెట్టలేక నిరీక్షిస్తున్నాడు. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు మొదలుఅవ్వడానికి సిద్ధం అవుతోంది. నిజానికి నాగ్ ‘బిగ్ బాస్’తో బిజీ లేకపోతే ఈ సినిమా అక్టోబర్ లోనే స్టార్ట్ అయ్యేది. దానికితోడు మధ్యలో నాగ్ మరో సినిమా కమిట్ అయ్యాడు. దాంతో నాగార్జున బంగార్రాజు మీదకు ఎప్పుడు వస్తాడో తెలియక ఈ సినిమా ఇలా వాయిదా పడుతూనే ఉంటుంది.. ఇక ఈ మధ్యలో ఒక సినిమా చేసుకుని వద్దాం అని కళ్యాణ్ కృష్ణ ఫిక్స్ అయ్యాడట. ఇదే విషయాన్ని నాగ్ కి చెబితే.. తానూ కరోనా క్వారెంటెన్ నుండి బయటకు రాగానే ఫస్ట్ షెడ్యూల్ షూట్ ప్లాన్ చేద్దాం అని కళ్యాణ్ కృష్ణకు నాగ్ క్లారిటీ ఇచ్చాడట.

    Also Read: ‘ఆది పురుష్’కి సప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ !

    మొత్తానికి అనుకున్న సమయానికి బంగార్రాజు స్టార్ట్ కాలేకపోయినా.. ఎట్టకేలకు స్టార్ట్ కాబోతోంది. అయితే డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… అన్ని కుదిరితే వచ్చే శివరాత్రికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడట.