Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ సోహెల్ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.తొలి వారం నామినేషన్స్ లో సీరియల్ బ్యాచ్ మొత్తం ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. దీనికి సోహెల్ స్పందించి ప్రశాంత్ కు మద్దతుగా’ ఫార్మర్ ‘ అని ఇన్ స్టా స్టోరీ లో పెట్టాడు. ప్రశాంత్ హేటర్స్ సోహెల్ ని బూతులు తిడుతూ మెసేజ్ లు చేశారు. దీంతో కొద్ది సేపటికి ఆ స్టేటస్ ని తీసేసాడు సోహెల్.
అసలు పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడానికి కారణాలు ఏంటో చెప్పుకొచ్చాడు ..”పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే .. నేను నటించిన లక్కీ లక్ష్మణ్ ,ఆర్గానిక్ మామ,మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ మూడు సినిమాలకు వాడు ఊరు నుంచి వచ్చి నాకు సపోర్ట్ చేశాడు. మన సినిమా ఎలా ప్రమోట్ చేద్దాం అన్న అని వాడంత వాడు అడిగి ప్రమోషన్ చేసాడు. నేను జై కిసాన్ అని సింబల్ పెట్టాను అంతే వెంటనే నన్ను తిడుతూ మెసేజ్ లు పెట్టారు. నన్ను ఫాల్తూ గాడు సోహెల్ గాడు అని కామెంట్ చేశారు.
ఆ కామెంట్ పెట్టినవాడు దొరకాలి వాడిని కెమెరా ముందుకు లాక్కొచ్చి నన్ను ఎందుకు తిట్టావ్ అని కచ్చితంగా అడుగుతా. ఇక అప్పటి నుంచి బిగ్ బాస్ కూడా ఫాలో అవ్వడం ఆపేశా. మనకెందుకొచ్చిన తలనొప్పి అని మానేశా. ఇప్పుడు నేనేమైనా అంటే నా కొత్త సినిమా పై ఆ ప్రభావం పడుతుంది. బూట్ కట్ బాలరాజు రిలీజ్ కానుంది. అందుకే ఏం అనకుండా ఆగుతున్నా.
నా కష్టాల్లో నేను ఉన్న సినిమాల్లో సక్సెస్ కోసం ట్రై చేస్తున్న. ఒకరికి సపోర్ట్ చేసి, మరొకరికి చేయలేదని ఫీల్ అవుతారు. ఇలాంటి తలనొప్పులు ఉండకూడదని.. అన్నిటికి దూరంగా ఉంటున్న అని చెప్పుకొచ్చాడు సోహెల్. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సోహైల్ ఫైనల్ కి వెళ్ళాడు. రూ.10 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు.