Solar Eclipse
Solar Eclipse: ఈ ఏడాదిలో రెండో సూర్య గ్రహణం అక్టోబర్ 14న ఏర్పడబోతుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8.34 గంటలకు సూర్య గ్రహణం ఏర్పడుతంది. అయితే సూర్యగ్రహణం అనగానే చాలా మంది ప్రత్యేకంగా ఉంటారు. గ్రహణం తరువాత ఇల్లును శుద్ధి చేసుకుంటారు. కానీ ఈ సూర్య గ్రహణం భారత్ లో పెద్దగా కనిపించదు.ఇక్కడ పెద్దగా ప్రభావం లేనందున సూతుకం ఉండదని కొందరు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే గ్రహాల మార్పు కారణంగా కొన్నిరాశుల వారికి సూర్యగ్రహణం ప్రభావం ఉండొచ్చని కొందరు అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
హిందూశాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో తుగు జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ముఖ్యంగా గర్భిణులు అప్రమత్తంగా ఉండాలంటారు. అయితే అక్టోబర్ 14 శనివారం అమావాస్య కానుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలో ఇది పాక్షిక గ్రహణ మైనా కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. అయితే ప్రభావం చూపే రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
మేషరాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారిపై ఎక్కువగా ప్రభావం చూపకపోయినా ప్రత్యర్థులను శాంతింప చేయిస్తుంది. వృషభ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దీంతో ఆందోళనగా కనిపిస్తారు. అయితే ప్రేమ చూపడం ద్వారా మనశ్శాంతి ఉంటుంది. మిథున రాశివారికి సూర్యగ్రహణ ప్రభావం కాస్త ఉంది. దీంతో భయాంతోళనతో గడుపుతారు. అయితే వీరు ప్రియమైన వారి నుంచి ఎక్కువగా ఏదీ ఆశించకపోవడం మంచిది.
కర్కాటక రాశివారు వ్యాపార ప్రయోజనాలుఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరికి ధైర్యాన్ని పెంచుతుంది. సింహారాశివారికి ఈ గ్రహణం అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కన్యరాశివారు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయాన్ని విస్మరించకూడదు. తులా రాశివారికి ధన నష్టం కలిగే అవకాశం ఉంది. సంబంధాల్లో అసౌకర్యంగా ఫీలవుతారు.
వృశ్చికరాశివారికి సూర్యగ్రహణ ప్రభావం ప్రయోజనకరం. వ్యాపారం చేసేవారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ధనుస్సు రాశివారు ఇంట్లోఅసౌకర్యంగా ఉంటారు. వ్యక్తిగత ప్రయత్నాలు విఫలం కావొచ్చు. అయితేకాస్తా ఓపిక పట్టాలి. మకర రాశివారు గౌరవం విషయంలో భయపడిపోతుంటారు. కానీ దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్లాలి. కుంభరాశివారు శారీరక బాధలు పొందే అవకాశం. ఆసక్మిక సంఘటను జరుగుతాయి. మీనరాశివారి జీవితభాగస్వామ్యానికి ఇబ్బందులు వచ్చే అవకాశం. భూమి కొనుగోలు, నిర్మాణాలకు దూరంగా ఉండడంమంచిది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: The effect of solar eclipse on these zodiac signs do you know what will happen
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com