https://oktelugu.com/

Ramarao on Duty: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’

Ramarao on Duty: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోరుమీద ఉన్నాడు. కాగా రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది అని.. రవితేజ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉందని తెలుస్తోంది. కాగా యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు వివరించింది […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 / 02:15 PM IST
    Follow us on

    Ramarao on Duty: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోరుమీద ఉన్నాడు. కాగా రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది అని.. రవితేజ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉందని తెలుస్తోంది.

    Ramarao on Duty

    కాగా యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు వివరించింది టీమ్. ఈ సినిమా హిందీ స్ట్రీమింగ్ రైట్స్‏ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘సోనీ లీవ్’ భారీ ధరకు సొంతం చేసుకుంది. అన్నట్టు రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా టీజర్ మహాశివరాత్రిని పురస్కరించుకొని విడుదల అయి మంచి ఆదరణ పొందింది. ఇటీవల పోలీస్‌ చిత్రాలు హిట్ కొడుతుండగా, రామారావు ఆన్‌ డ్యూటీ కూడా విక్రమార్కుడు తరహాలో హిట్టవుతుందని అంటున్నారు.

    Also Read: అవును, నేనూ ప్రేమించాను – ఇళయరాజా

    మరోపక్క మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ పోవడంతో కొత్త దర్శకులు అందరూ ఇప్పుడు రవితేజ చుట్టూ తిరుగుతున్నారు. కథ నచ్చితే.. వెంటనే ఛాన్స్ ఇవ్వడానికి రవితేజ ముందుకు ఉత్సాహంగా ఉంటాడు. అన్నట్టు రవితేజ ‘ధమాకా’ విషయానికి వస్తే.. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను.. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    కాగా రవితేజ 69వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందట. చిరు ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

    Ramarao on Duty

    ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కూడా మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి.. తన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ సినిమాల శైలిలోనే నక్కిన ఈ సినిమాని కూడా మలచబోతున్నాడు.

    Also Read: ఇంకా అజ్ఞాతంలోనే మగ్గిపోతున్న ‘విరాటపర్వం’

    Recommended Video:

    Tags