Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ సినిమాలకు దూరమై దశాబ్దం అవుతుంది. తెలుగు ఆడియన్స్ మాస్ పల్స్ కి తగ్గట్టుగా ఆయన తీసిన చివరి చిత్రం ‘మిర్చి’. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ అలాంటి సినిమాలు చేయడం మానేసాడు. ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్ స్కోప్ ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. దీని వల్ల ఆయన మార్కెట్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ పోగొట్టుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కల్కి, సలార్ లాంటి సినిమాలు అర్థం కావు. అందుకే ప్రభాస్ అభిమానులు ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాని చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకే ఆయన ‘రాజా సాబ్’ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వబోతుంది.
ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయగా, ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి చెందారు. ప్రభాస్ చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉన్నాడు, అభిమానులు కోరుకున్నట్టుగానే కమర్షియల్ సినిమా చేస్తున్నాడని ఆ గ్లిమ్స్ వీడియో ని చూసి అనుకున్నారు. కానీ పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో ప్రభాస్ చిత్రం రావడం కష్టం. తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు ఉంటాయి, అదే విధంగా బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకర్షించే అంశాలు కూడా ఉంటాయి. అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ చిత్రంలో ప్రభాస్ నీటి లోపల ఉండే ఒక డైనోసర్ తో ఫైట్ చేస్తాడట. ఇది సినిమాకే హైలైట్ గా నిలబడబోతుందని అంటున్నారు. డైనోసర్ తో పోరాటం ఏమిటి?, అసలు ఎప్పటి కాలం కథ ఇది?, మారుతీ అసలు ఏమి ప్లాన్ చేస్తున్నాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్రం లో చాలానే ఉంటాయని సమాచారం.
హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్ ని పర్ఫెక్ట్ గా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ ‘స్త్రీ 2’. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికే ఆ రేంజ్ వసూళ్లు వస్తే, ఇక ప్రభాస్ రేంజ్ స్టార్ కి ఆ జానర్ లో సరైన సినిమా పడితే ఏ రేంజ్ సునామి ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రభాస్ కి తెలుగు లో విపరీతమైన క్రేజ్ ఉంది, అలాగే బాలీవుడ్ లో కూడా ఉంది. రెండు మార్కెట్స్ విశ్వరూపం చూపిస్తాయనే చెప్పాలి.