Sobhita Dhulipala: అచ్చ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెనాలిలో పుట్టిన శోభిత ధూళిపాళ్ల మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆఫర్స్ కోసం ఆఫీసులు చుట్టూ తిరిగే రోజుల్లో అనేక అవమానాలు ఎదురయ్యాయట. నువ్వు బ్యాక్ గ్రౌండ్ లో నిల్చోవడానికి కూడా పనికిరావని అవమానించారట. అవమానించిన సంస్థకే మోడల్ గా తర్వాత యాడ్స్ చేశానని ఆమె ఓ సందర్భంలో అన్నారు.
శోభిత ధూళిపాళ్ల తెలుగులో గూఢచారి మూవీలో నటించింది. 2018లో విడుదలైన గూఢచారి మంచి విజయం సాధించింది. మరలా ఆమె తెలుగులో నటించలేదు. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ కీలక రోల్ చేసింది. శోభిత ధూళిపాళ్ల హీరో నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ వార్తలతో పాప్యులర్ అయ్యింది.
నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. కొంత నిర్మిస్తున్న తన ఇంటికి తీసుకెళుతున్నడని పుకార్లు వినిపించాయి. నాగ చైతన్య టీమ్ ఈ కథనాలను కొట్టిపారేశారు. అయితే వీరిద్దరూ లండన్ లోని ఒక రెస్టారెంట్ దర్శనం ఇచ్చారు. ఆ ఫోటో వీరి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది.
నాగ చైతన్యతో సెల్ఫీ తీసుకున్న ఆ హోటల్ చెఫ్ దాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో దూరంగా శోభిత ధూళిపాళ్ల కూడా ఉంది. వార్తలు రావడంతో చెఫ్ ఫోటో ఇంస్టాగ్రామ్ నుండి డిలీట్ చేశాడు. కాగా ఇటీవల ముంబైలో మరో కుర్రాడితో డిన్నర్ నైట్ కి వెళుతూ కనిపించింది శోభిత. అతడు తన బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో సెగలు పెట్టిస్తుంది.