Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ.. అచ్చ తెలుగు అమ్మాయి. కానీ, ముంబై భామల సైతం శోభిత బోల్డ్ నెస్ ముందు దిగదుడుపే. అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రమే ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ వస్తోంది. అందాల ప్రదర్శన చేయకపోయినా, అద్భుతంగా నటించకపోయినా వాళ్లకు ఓ స్థాయిలో పేరు వస్తోంది. కానీ శోభిత ధూళిపాళ లాంటి నటీమణులకు కాలం కలిసి రాదు. అయినా వాళ్ళు కాలాన్ని ఎదిరిస్తారు. ఈ క్రమంలో సమాజాన్నే ఎదిరించాల్సి వస్తోంది.

కుటుంబాన్ని కూడా వదులుకోవాల్సి వస్తోంది. శోభిత ధూళిపాళ జీవితంలో ఇవ్వన్నీ జరిగాయి. తనకు భారీ గుర్తింపు రాకపోయినా.. మంచి అవకాశాలు రాకపోయినా తన ప్రయత్నాలను మానుకోలేదు. కష్టపడింది. కొన్ని సినిమాల్లో అయితే, నగ్నంగా కూడా నటించింది. తనకు నటన అంటే అంత ఇష్టం. కెరీర్లో ఎన్ని ఎత్తుపల్లాలను చూసినా ఎన్నడూ భయపడలేదు.
ఆరోపణలను అవమానాలను పెద్దగా పట్టించుకోలేదు. ఇటు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలను కాకుండా తనదైన శైలిలో ఫోటోలు పోస్ట్ చేస్తూ వీలైనంతగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా కష్టపడింది. ఈ క్రమంలోనే ‘గూఢచారి’ సినిమాలో నటించింది. ఆ సినిమా నుంచి ఆమెకు అవకాశాలు పెరిగాయి.
దీనికి తోడు గత వారం రిలీజ్ అయిన కురుప్ సినిమా కూడా ఆమెకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో ఆమెకు ఎక్కువగా ఛాన్స్ లు వస్తున్నాయి. అలాగే శోభిత ధూళిపాళ ‘మేజర్’ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది శోభిత పాత్రకు ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందట.
Also Read: Renu Desai: పుకార్లు పై ‘రేణు దేశాయ్’ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !
శోభితకు తెలుగులో ‘మేజర్ రెండవ సినిమా. మరి ఈ సినిమాతో ఆమెకు తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇక మేజర్ సినిమా తెలుగు -హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకుడు. అతనే శోభితకు వరుస అవకాశాలు ఇస్తున్నాడు.
Also Read: RRRvsPrabhas: ‘ఆర్ఆర్ఆర్’కు అక్కడ పెద్ద సమస్యగా మారిన ‘రాధేశ్యామ్’!