https://oktelugu.com/

Liger: టైసన్​కు భారతీయ వంటకాలతో లైగర్​ టీమ్ ట్రీట్​!

Liger: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్​ లెజెండ్​ మైక్​టైసన్​ నటించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా, అమెరికాలో ఈ సినిమా కొత్త షెడ్యూల్​ ప్రారంభించారు. ఇందులో మైక్​టైసన్​ పాల్గొన్నారు. అయితే, షూటింగ్​ స్పాట్​లో టైసన్​ సంప్లిసిటీకి విజయ్​తో పాటు చిత్ర యూనిట్​ మొత్తం ఆశ్చర్యపోయిందట. అంతే కాదు, టైసన్​కు భారతీయ వంటకాల రుచులను తినిపించారట. అవి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 18, 2021 / 11:00 AM IST
    Follow us on

    Liger: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్​ లెజెండ్​ మైక్​టైసన్​ నటించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా, అమెరికాలో ఈ సినిమా కొత్త షెడ్యూల్​ ప్రారంభించారు. ఇందులో మైక్​టైసన్​ పాల్గొన్నారు. అయితే, షూటింగ్​ స్పాట్​లో టైసన్​ సంప్లిసిటీకి విజయ్​తో పాటు చిత్ర యూనిట్​ మొత్తం ఆశ్చర్యపోయిందట. అంతే కాదు, టైసన్​కు భారతీయ వంటకాల రుచులను తినిపించారట. అవి ఆయనకు చాలా బాగా నచ్చాయట.

    టైసన్​కు ఎంతో ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకుని మరీ వడ్డించారట. దీంతో పాటు, ఆయన భార్యకోసం లైగర్​ టీమ్​ స్పెషల్​గా లంచ్​ ఏర్పాటు చేసింది. గార్లిక్ నాన్, బట‌ర్ చికెన్, తందూరి చికెన్, ఫిష్ టిక్కా మసాలా, గోట్ బిర్యానీ లాంటి స్పెషల్ ఐటమ్స్‌తో టైసన్​కు విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వెజ్​లో ఆలూ గోబీ, పాలక్ పన్నీర్, సమోస, కబాబ్స్‌లను మైక్ టైసన్ స్పెషల్‌గా అడిగినట్లు సమాచారం.

    ఇండియన్ వంటకాల మీద టైసన్‌కు ఉన్న మక్కువ చూసి చిత్రయూనిట్ ముచ్చటపడిందట. చిత్రయూనిట్ ప్రేమగా వడ్డించడం, అతిథి మర్యాదలను చూసి మైక్ టైసన్ కూడా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు షూటింగ్​ స్పాట్​లో మైక్​టైసన్​ పూర్తి యాక్టివ్​గా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల లైగర్​ టీమ్​తో టైసన్​ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. ఈ సినిమాను  బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.