https://oktelugu.com/

Naga Chaitanya And Sobhita: జంటగా నాగ చైతన్య-శోభితలకు మంగళ స్నానాలు, సోషల్ మీడియాలో మెస్మరైజింగ్ ఫోటోలు వైరల్!

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. వివాహ వేడుకలు షురూ అయ్యాయి. నాగ చైతన్య-శోభితల హల్దీ ఫంక్షన్ జరిగింది. ఈ తంతులో జంటగా మంగళ స్నానాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హల్దీ వేడుక ఫోటోలు మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి.

Written By: , Updated On : November 29, 2024 / 10:37 AM IST
Naga Chaitanya And Sobhita

Naga Chaitanya And Sobhita

Follow us on

Naga Chaitanya And Sobhita: అక్కినేని నాగార్జున ఇంట్లో వరుస వేడుకలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు నెలలో నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. కేవలం ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం ఏఎన్నార్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. నాగ చైతన్య-శోభిత ల వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. డిసెంబర్ లోనే ముహూర్తం ఫిక్స్ చేశారు.

4వ తేదీ రాత్రి 8:13 నిమిషాలకు వివాహం అట. నాగ చైతన్య వివాహానికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. తాతయ్య ఏఎన్నార్ విగ్రహం ఎదుట మండపం ఏర్పాటు చేస్తారట. ఆయన ఆశీస్సుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారట. పెళ్లి కూడా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కేవలం 300 మంది అతిథులు, సన్నిహితులు, ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం ఉంది. పెళ్లి సింపుల్ గా చేసుకోవాలనేది నాగ చైతన్య నిర్ణయం అట.

కాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించారు. నాగ చైతన్య క్రీం కలర్ ట్రెడిషనల్ వేర్ ధరించారు. ఇక శోభిత ఎర్ర చీరలో అద్భుతంగా ఉన్నారు. హల్దీ వేడుక అనంతరం వీరిద్దరికీ జంటగా మంగళ స్నానాలు చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరోవైపు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కి కూడా పెళ్లి కుదిరింది. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనాబ్ తో అఖిల్ కి వివాహం జరగనుంది. అఖిల్-జైనాబ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నెలల వ్యవధిలో నాగ చైతన్య-అఖిల్ పెళ్లి వేడుకలు జరగనున్నాయని సమాచారం. వరుస వేడుకల నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ లో సంబరాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున ఆనందంగా ఉన్నారు. ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ ఈ విషయం తెలియజేస్తున్నాయి.