Snake panic Sandhya Theatre Hyderabad : హైదరాబాద్ లో మూవీ లవర్స్ సినిమాలను చూసేందుకు అత్యధికంగా ఇష్టపడే ప్రాంతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇక్కడ సంధ్య థియేటర్(Sandhya Theatre) కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలు ఇక్కడ సంచలనాత్మక విజయాలు సాధించాయి. స్టార్ హీరోలకు సంబంధించిన మొదటి రోజు మొదటి ఆట ఈ థియేటర్ లో చూడడం ఒక అదృష్టం గా భావిస్తూ ఉంటారు స్టార్ హీరోల అభిమానులు. గత ఏడాది డిసెంబర్ లో ఈ థియేటర్ పేరు దేశవ్యాప్తంగా ఎలా మారు మోగిందో అందరికీ తెలిసిందే. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో లో తొక్కిసిలాట ఘటన జరగడం. అందుకు అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన ఘటనలు, పరిణామాలు మొత్తం మనం చూసాము. అయితే ఈ థియేటర్ ఇప్పుడు మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. థియేటర్స్ లోకి ఎలుకలు రావడం మనం చూసి ఉంటాము. కానీ పాములు రావడం ఎప్పుడైనా చూశామా?.
Also Read : టీవీ లైవ్‌లో దాదాగిరి.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేసిన ఓయూ నేత బెదిరింపుల వీడియో వైరల్!!
సంధ్య థియేటర్ లో నేడు 50 రూపాయిల టికెట్ బ్లాక్ వద్ద పాములు సంచరిస్తూ కలకలం సృష్టించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈమధ్య కాలం లో సంధ్య థియేటర్ లో తరచూ పాములు ప్రవేశిస్తున్నాయని సిబ్బంది మీడియా తో పేర్కొన్నారు. సమయానికి ఇప్పుడు థియేటర్ ఖాళీగా ఉంది కాబట్టి సరిపోయింది. జనాలు భారీ గా ఉన్న సమయంలో పాములు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటి?. ఎల్లుండి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాత సినిమా తొలిప్రేమ చిత్రం ఇందులో రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు పవన్ అభిమానులు భారీగా తరళి వస్తారు. 50 రూపాయిల టికెట్స్ బ్లాక్ వద్ద వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇలా పాములు దూరితే పరిస్థితి ఏమిటి? మళ్ళీ తొక్కిసిలాట జరగడం పెద్ద కష్టమేమి కాదేమో కదా?.
ఇక మీదట పాములు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యందే అని, ఇప్పటికే తొక్కిసిలాట ఘటన కి లైసెన్స్ రద్దు అయ్యే పరిస్థితి వరకు వచ్చి, తృటిలో ఆ ప్రమాదం తప్పిందని, మరోసారి పొరపాటు జరిగితే హైదరాబాద్ వాసులు ఎంతో ఇష్టం గా చెప్పుకునే సంధ్య థియేటర్ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నెటిజెన్స్ హెచ్చరిస్తున్నారు. అసలు ఈరోజు వచ్చిన వీడియో వాళ్ళని తీవ్రమైన భయబ్రాంతులకు గురి చేసింది. జనాలు సంచరించే చోట ఈ విష సర్పాలు ఎక్కడి నుండో వస్తున్నాయో అర్థం కావడం లేదంటూ థియేటర్ సిబ్బంది చెప్పుకొస్తున్నాడు. చూడాలి మరి దీనికి శాశ్వత పరిష్కారం సంధ్య థియేటర్ యాజమాన్యం ఎలా చూపించబోతుంది అనేది. సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
సంధ్య థియేటర్లో పాముల కలకలం
ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు
పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025