Small Movies Shook the Box Office: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పిస్తూ వస్తున్న చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్లను మంచి యంగ్ డైరెక్టర్లు తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి భారీ విజయాలను సాధిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 50 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక అనిల్ రావిపూడి వెంకటేష్ కలిసి భారీ హిట్ ను నమోదు చేశారు… ఇక ‘మహావతార్ నరసింహా’ సినిమా 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది… ఇక ‘సైయారా’ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో దొరికేక్కి 570 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది… ఇక మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘తుడురాం’ మూవీ 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 250 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ‘కొత్త లోక’ సినిమా 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఇప్పటివరకు 190 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చాలా సినిమాలు బోల్తా కొడుతుంటే తక్కువ బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించి సూపర్ సక్సెస్ గా నిలిచాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట రాబోతున్న సినిమాల విషయంలో కూడా మన దర్శక నిర్మాతలు జాగ్రత్తలను తీసుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన సినిమాలకే ఎక్కువ క్రేజ్ అయితే దక్కుతోంది. కాబట్టి అలాంటి బాటలోనే ఇకమీదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకనిర్మాతలు మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేయాలని తద్వారా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు… మొత్తానికైతే చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ లు అనేవి ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమా కూడా మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు ఇప్పటికే 15 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత కలెక్షన్స్ ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…