Real-life inspector Zende: పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న చాలా మంది ఆఫీసర్స్ గట్స్ తో ఉంటారు… వాళ్లు యూనిఫాం వేసుకున్నందుకు ఎంతో కొంత డ్యూటీ చేసి ఎలాగైనా సరే జనానికి హాని చేసే వాళ్లను పట్టుకొని జైల్లో బంధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి సినిమాల్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ గురించి చూస్తూ ఉంటాం… నిజ జీవితంలో సైతం కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వారి డ్యూటీ ని వాళ్ళు సక్రమంగా నిర్వహించినప్పటికి పై నుంచి వచ్చే ప్రెజర్స్ వల్ల వాళ్ళు తమ డ్యూటీని సంపూర్ణంగా చేయలేకపోతారు. దానివల్ల కొన్నిసార్లు వాళ్ళు బ్యాడ్ నేమ్ ని కూడా సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇలాంటి క్రమంలోనే అప్పట్లో’చార్లెస్ శోభరాజ్’ అనే వ్యక్తి మాఫియా ను గడగడలాడించాడు. అలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను రెండుసార్లు పట్టుకున్న ఏకైక పోలీస్ ఆఫీసర్ ‘మధుకర్ బాపూ రావ్ జెండే’ గారే కావడం విశేషం… ధైర్యానికి ఈయనను మారుపేరుగా చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మాఫియాని గడగడలాడించిన చార్లెస్ శోభారాజ్ ని పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. 1976 వ సంవత్సరం లో ఒక లేడీ ని ముద్ర చేసిన కేస్ లో జెండే గారు చార్లెస్ శోభ రాజ్ ను అరెస్ట్ చేశాడు…
ఇక ఆ తర్వాత మరో కేసు విషయంలో 1986 లో మరోసారి ఎవ్వరికి దొరక్కుండా దాక్కున్న శోభ రాజ్ ను మరోసారి అరెస్ట్ చేసి సంచలనం సృష్టించాడు…ఇక అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నుంచి కూడా ప్రశంసలు అయితే దక్కాయి. అలాగే చార్లెస్ శోభ రాజ్ ను పట్టుకున్న తర్వాత స్వయంగా రాజీవ్ గాంధీ గారే జెండే ను కలిసి ఆయనను ప్రశంసించడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది…ఇక ప్రస్తుతం ఆయన జీవిత కథ ఆధారంగానే మనోజ్ బాజ్ పాయ్ మెయిన్ లీడ్ లో ‘ఇన్స్పెక్టర్ జెండే’ అనే సినిమా వచ్చింది.
ఈ మూవీ ఈనెల 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి మంచి పాపులారిటీ రావడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలను సైతం అందుకుంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన గురించి చాలామంది ఇప్పుడు సెర్చ్ చేస్తుండటం విశేషం…ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన గురించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా చాలా తక్కువ మంది పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి ధైర్యసాహసాలను చేసి మంచి పాపులారిటీని సంపాదించుకుంటారు. ఇంకా అలాంటి వాళ్ళలో జెండే గారు కూడా ఒకరు కావడం విశేషం… ఆయన మీద తీసిన సినిమాకి సైతం మంచి గుర్తింపు రావడం అలాగే మనోజ్ బాజ్ పాయ్ సైతం చాలా బాగా నటించి మెప్పించడమే కాకుండా ఒరిజినల్ జెండే పాత్రను గుర్తు చేశాడు అంటూ విమర్శకులు సైతం ప్రశంసలను కురిపిస్తుండడం విశేషం…