SKN The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం రేపు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై మొదట్లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు , కానీ రీసెంట్ గా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ హైప్ ని సొంతం చేసుకుంది. కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, ప్రీమియర్ షోస్ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డల్ గానే సాగుతున్నాయి. అయితే నేడు ఈ సినిమా యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత SKN మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది, మొదటి నుండి ఇతని మాటలు మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగానే ఉంటున్నాయి.
ఆయన మాట్లాడుతూ ‘తెలుగు సినిమా మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన హీరో ప్రభాస్. ఈరోజు ఇన్ని పాన్ ఇండియన్ సినిమాలు విడుదల అవుతున్నాయంటే, అందుకు మూలకారణాలలో ఒకరు ప్రభాస్. అలాంటి ప్రభాస్ ఐదేళ్ల నుండి కస్టపడి చేసిన సినిమా ఇది. దయచేసి ఇండస్ట్రీ పెద్దలు మా సినిమాకు ఎక్కువ థియేటర్స్ వచ్చేందుకు సహకరించండి. అలా సహకరించిన ప్రతీ ఒక్కరికి విడుదల తర్వాత పేరు పేరున ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలు అనే పదాన్ని SKN ఎవరిని ఉద్దేశించి చేసాడు?, చిరంజీవి ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అనుకోవచ్చా?, ఈ సమయం లో ఇలాంటి పొగరు కామెంట్స్ అవసరమా అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం SKN ఇండస్ట్రీ లో నిర్మాతగా కొనసాగుతున్నాడు , అదే విధంగా ప్రభాస్ కి PR గా కూడా గత కొన్నేళ్ల నుండి పని చేస్తున్నాడు.
అయితే SKN అనే మనిషి పేరు సోషల్ మీడియా లో ఇంత వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం, ఆయన ఒక మెగా ఫ్యాన్ అనే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ లకు PR గా పనిచేయడానికి కారణం, ఆయన మెగా ఫ్యాన్ అనే. ఏ పేరు ని ఉపయోగించుకొని ఇంత దూరం వచ్చాడో, ఇప్పుడు ఆయనకే సెటైర్స్ వేసేంత రేంజ్ కి వచ్చేసాడా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన ప్రభాస్ సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చేయాలి, కానీ తెలుగు సినిమా కి అంతర్జాతీయ లెవెల్ లో మొట్టమొదటిసారిగా గుర్తింపుని తీసుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మాత్రం తక్కువ థియేటర్స్ కావాలా?, అసలు ఏంటి ఇతని ఉద్దేశ్యం అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఇండస్ట్రీ పెద్దలారా… రాజా సాబ్ కి కోపరేట్ చేసి థియేటర్స్ ఇవ్వండి!! pic.twitter.com/Bf8tVHJZ09
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 7, 2026