Skanda Movie Review : తెలుగులో ప్రతి వారం కొన్ని సినిమాలు రిలీజ్ అయి సందడి చేస్తూ ఉంటాయి. అందులో ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం స్కంద. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు . అఖండ తర్వాత బోయపాటి రూపొందించిన ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. అలాగే ప్రస్తుతం లీడ్ లో ఉన్న శ్రీలీల కథానాయికగా నటించడం కూడా సినిమాపై అంచనాలు ఏర్పడటానికి కారణం అయింది ..
ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా .. థమన్ మ్యూజిక్ అందించారు . ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ అన్ని కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి .. అంతేకాకుండా ఈ సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు .. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏ మేరకు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది అనేది రివ్యూ లో తెలుసుకుందాం …
ముందుగా కధ విషయానికి వస్తే .. రాయలసీమలోని ఓ చిన్న పల్లెటూరు లో నివసించే రామ్ తండ్రికి ఊర్లో మంచి పేరు ఉంటుంది .. అతను ప్రజలకు కావాల్సిన సహాయం చేస్తూ .. న్యాయం కోసం పోరాడుతాడు. రామ్ ది సైతం అలాంటి లక్షణమే .. ఇక శ్రీలీల ఓ సంపన్న భూస్వామి కూతురు. మంచి చురుకైన అమ్మాయి .. ఈ ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయి ప్రేమించుకుంటారు . కాని వారి ప్రేమకుటుంబాలకి నేరం అవుతుంది. శ్రీలీల కుటుంబాన్ని రామ్ తండ్రి అంగీకరించడు.. శ్రీలీల తండ్రి రామ్ కుటుంబాన్ని అంగీకరించడు. రెండు కుటుంబాలు శత్రువులు కావడంతో తమ పిల్లలను వేరుగా ఉంచాలని నిశ్చయించుకుంటారు .ఈ క్రమంలో రామ్ కి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి . ఎన్నో సవాళ్లను, శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది .. వాటిని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు .. శ్రీలీల ప్రేమని దక్కించుకున్నాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే …సినిమా అంతటా బోయపాటి మార్క్ మాస్ హీరోయిజం కనిపించి మెప్పించింది . మాస్ మూమెంట్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి .. ముఖ్యంగా రామ్ డైలాగ్స్ మెప్పిస్తాయి . ఫస్టాఫ్ లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ సీన్స్‌తో సరదాగా సాగుతూ మెప్పిస్తుంది . అలాగే రామ్ , శ్రీలీల డాన్స్ అదిరిపోయింది .. వారిద్దరి డ్యాన్స్ చూడటానికే ఆడియెన్స్ రిపీటెడ్ గా వస్తారని చెప్పవచ్చు . ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే సెగలు పుట్టించడం ఖాయం…
బోయపాటి మాస్ పవర్ ఏంటో అక్కడే కనిపిస్తుంది .. ఇక నేపథ్య సంగీతం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు .. . తమన్ సంగీతంతో థియేటర్లలో మోత మోగిపోతుందని చెప్పవచ్చు .
ఫస్టాఫ్ ని లవ్ ట్రాక్, కామెడీతో నడిపించిన బోయపాటి సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించారు .. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ ఇంకా బాగుంది .ఓ సాధారణ కధకు మాస్ ఎలిమెంట్స్ , ఎమోషన్స్ జోడించి బోయపాటి మార్క్ మాస్ ఎంటర్‌టైన్మెంట్ అందించారనే చెప్పవచ్చు
ఇక నటీనటుల విషయానికి వస్తే రామ్ పోతినేని డాన్స్, శ్రీలీల అందంతో పాటు అభినయం సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు . హీరో , హీరోయిన్ పెయిర్ .. అలాగే వారి నటన కూడా మెప్పిస్తుంది .ఇక సాయీ మంజ్రేకర్ , శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ నటనతో అలరించారు … మిగతా వారు పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ఇక దర్శకుడు సాంకేతిక విషయాలకి వస్తే .. బోయపాటి తన మార్క్ యాక్షన్ తో ఆడియెన్స్ ని అలరించే ప్రయత్నం చేశాడు.. అలాగే థమన్ సంగీతం హైలైట్ గా ఉంది .. ఇక సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ , తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి.సినిమా నిర్మాణ విలువలు అలరిస్తాయి మొత్తంగా చూస్తే బోయపాటి -రామ్ కాంబో లో తెరకెక్కినా ఈ చిత్రంలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ఆడియెన్స్ ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పవచ్చు …
ఇక రామ్ కి ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఇప్పటి వరకు పడలేదు. ఇక దీంతో ఈ సినిమా ఒక భారీ హిట్ అందుతుందేమో చూడాలి ఇక శ్రీలీల మాత్రం ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగే అవకాశం అయితే ఉంది…